RSS: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పది లక్షల మంది విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్
భారతదేశ యువత ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్ మెంట్ టు యునైట్ నేషన్స్(ఐఐఎంయుఎన్) సంస్థను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఈ నెల 13 వ తేదీ నుంచి మూడురోజుల డిజిటల్ ఫ్లాగ్‌షిప్ కాన్కోర్స్ సదస్సు నిర్వహిస్తున్నారు.
RSS: భారతదేశ యువత ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్ మెంట్ టు యునైట్ నేషన్స్(ఐఐఎంయుఎన్) సంస్థను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఈ నెల 13 వ తేదీ నుంచి మూడురోజుల డిజిటల్ ఫ్లాగ్‌షిప్ కాన్కోర్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ఈరోజుతో ముగియనున్నది. సదస్సు ముగింపు సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ సదస్సులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ముగింపు సమావేశాల్లో భాగంగా భారతదేశ స్వాతంత్ర 75వ వార్షికోత్సవం అదేవిధంగా ఐఐఎంయుఎన్ 10వ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే డాక్టర్ మోహన్ భగవత్ పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో 10 లక్షల మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా హాజరవుతున్నారు. వీరందరినీ ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడనున్నారు. ఈరోజు (ఆగస్టు 15) సాయంత్రం 4 గంటలకు ఆయన సమావేశంలో మాట్లాడతారని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల నుంచి విద్యార్థులు.. విద్యార్థ్ది నాయకులు పాల్గొంటున్నారు. వీరిలో అజయ్ పిరమల్, జనరల్ విపి మాలిక్, పీటీ ఉష వంటి ఐఐఎంయుఎన్ సలహాదారులు కూడా ఉన్నారు. మొత్తం 35 దేశాల నుంచి పదిలక్షల మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా సమావేశాల్లో పాల్గొంటున్నారని సంస్థ ప్రకటనలో తెలిపింది. ఈరోజు సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ”కొత్త భారతదేశానికి విజన్, ప్రపంచాన్ని ఏకం చేయడం- భారతీయ మార్గం” అనే అంశంపై తన సందేశాన్ని వినిపిస్తారని సంస్థ పేర్కొంది. ఈ సమావేశాలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించినట్టు సంస్థ వివరించింది. ఈ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఐఎంయుఎన్ మీడియా రిలేషన్స్, డిప్యూటీ ప్రెసిడెంట్, అభిషేక్ ధావన్ నుంచి తెలుసుకోవచ్చు. ఇతర వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : +919833997752
Also Read: జమ్మూ కాశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హిజ్ బుల్ ఉగ్రవాది తండ్రి..ఎవరంటే ..?