Watch Video: రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై సెల్‌ఫోన్ చోరీ.. కేటుగాళ్లు ఎలా కొట్టేశారో చూస్తే హడలిపోతారు..
Viral Video: ‘ప్రయాణికులు తమ లగేజీని స్వయంగా రక్షించుకోవాలి’ అని రైల్వే స్టేషన్లలో నిత్యం ప్రకటనలు ఇస్తూనే ఉంటారు. అధికారులు కూడా తమకు తారసపడిన ప్రతి ఒక్కరికి ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక ఆర్పీఎఫ్ సిబ్బంది.. రైల్వే స్టేషన్‌లో చోరీలు జరుగకుండా నిరంతరం గస్తీ కాస్తూనే ఉంటారు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తమ వస్తువులను కోల్పోతున్నారు. దొంగలు.. దొరికిందే ఛాన్స్‌గా అందిన ప్రతి వస్తువును ఎత్తుకెళ్తున్నారు.

Viral Video: ‘ప్రయాణికులు తమ లగేజీని స్వయంగా రక్షించుకోవాలి’ అని రైల్వే స్టేషన్లలో నిత్యం ప్రకటనలు ఇస్తూనే ఉంటారు. అధికారులు కూడా తమకు తారసపడిన ప్రతి ఒక్కరికి ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక ఆర్పీఎఫ్ సిబ్బంది.. రైల్వే స్టేషన్‌లో చోరీలు జరుగకుండా నిరంతరం గస్తీ కాస్తూనే ఉంటారు. ఇంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తమ వస్తువులను కోల్పోతున్నారు. దొంగలు.. దొరికిందే ఛాన్స్‌గా అందిన ప్రతి వస్తువును ఎత్తుకెళ్తున్నారు. మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం.. నడుచుకుంటూ వెళ్తున్న ప్రజల చేతుల్లో ఉన్న వస్తువులను, మెడలో ఉండే బంగారు చైన్లను, బ్యాగులను దొంగలు ఎత్తుకెళ్తుంటారు. కదులుతున్న ట్రైన్స్ నుంచి కూడా లగేజీని ఎత్తుకెళ్లే దొంగలుంటారు.
ఇక చాలా సందర్భాల్లో రైలు ఆలస్యంగా రావడంతో ప్లాట్‌ఫారమ్ లేదా స్టేషన్‌లో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నిద్రపోతుంటారు ప్రయాణికులు. ఇలాంటి పరిస్థితిలో చోరీలు ఎక్కువ అవుతాయి. ప్రయాణికులు నిద్రిస్తున్నది గమనించి, దొంగలు రెచ్చిపోతారు. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ.. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న వ్యక్తి నుంచి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అంతా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియో ప్రకారం.. రైల్వే ప్లాట్‌ఫామ్ నేలపై కొందరు ప్రయాణికులు నిద్రిస్తున్నారు. ఇంతలో ఆ పక్కనే పడుకున్న ఓ వ్యక్తి లేచి, తన పక్కన ఉన్న వ్యక్తి జేబులోంచి చాలా చాక్యంగా ఫోన్‌ను కొట్టేశాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారా? లేదా? అని చూస్తూ ఆ ఫోన్‌ను కొట్టేశాడు. ఆ తరువాత అక్కి నుంచి చడీచప్పుడు కాకుండా వెళ్లిపోయాడు. అతను దొంగతనం చేస్తున్నట్లు ఎవరికీ అనుమానం రాకుండా చాలా తెలివిగా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతని ప్రవర్తన కారణంగా.. చుట్టూ అంతమంది ఉన్నా అతను చోరీ చేస్తున్నట్లు గుర్తించలేకపోయారు.
దొంగను పట్టుకున్న ఆర్పీఎఫ్..
అయితే, బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగలను పట్టుకునేందుకు సిసి టీవీ ఫుటేజీని పరిశీలించారు. దొంగ చోరీ చేసిన విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. నిందితుడుని గుర్తించి, అతని పోటోను వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ దొంగను ఆర్పీఎఫ్ హౌరా సిబ్బంది పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ చోరీకి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన ఆర్పీఎఫ్ అధికారులు.. ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణికులు తమ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని ఆర్పీఎఫ్ సూచించింది.
ఆర్పీఎఫ్ షేర్ చేసిన వీడియో..
Using CCTV footage, #RPF Howrah nabbed a sneaky thief who was targeting sleeping passengers & swiping their phones.
Stay one step ahead of pickpockets. Keep your valuables secure & stay alert in crowded places.#OperationYatriSuraksha #StayAlert #StaySafe pic.twitter.com/LYo4bR2wRV
— RPF INDIA (@RPF_INDIA) August 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..