AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh: దసరా ఉత్సవాల్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు. నలుగురు భక్తులు మృతి, 20 మందికి తీవ్రగాయాలు

ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జష్‌పూర్‌లో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులపై ఓ కారు దూసకెళ్లింది.

Chhattisgarh: దసరా ఉత్సవాల్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు. నలుగురు భక్తులు మృతి,  20 మందికి తీవ్రగాయాలు
Chhattisgarh Car Crash
Venkata Narayana
|

Updated on: Oct 15, 2021 | 5:51 PM

Share

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జష్‌పూర్‌లో దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తరువాత ఆగ్రహం చెందిన భక్తులు ఆ కారును తగులబెట్టారు. భక్తులపై దూసుకెళ్లిన కారు తరువాత పొలాల్లో బోల్తా పడింది. డ్రైవర్‌ దగ్గరి నుంచి గన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతున్న డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు.  అయితే, ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. భక్తులపై విచక్షణా రహితంగా కారును అత్యంత వేగంగా పోనిచ్చి అత్యంత కర్కశంగా చంపిన ఉదంతం సంచలనంగా మారుతోంది.

భక్తులపైకి ఒక్కసారిగా కారు దూసుకెళ్లడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జష్​పుర్​లోని పతాలగావ్​లో దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి భక్తుల బృందం వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటన నుంచి తేరుకున్న అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు. ప్రమాదానికి కారణమైన కారును పట్టుకున్నారు. అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడినట్టు తెలుస్తోంది. స్థానికుల ఆగ్రహం..కారు దూసుకెళ్లిన ఘటన అనంతరం ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పతాల్​గావ్​ పోలీస్​ స్టేషన్​ ఎదుట బైటాయించారు. నిరసన చేపట్టారు.

ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఓ పోలీసును నిరసనకారులు కొట్టినట్టు తెలుస్తోంది. మీడియా ప్రతినిధులపైనా దాడి చేసినట్టు సమాచారం. భక్తులపై దూసుకెళ్లిన కారు తరువాత పొలాల్లో బోల్తా పడగా, డ్రైవర్‌ దగ్గరి నుంచి గన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతున్న డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. కారులో పెద్ద ఎత్తున గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు 5 కోట్ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. గాయపడ్డ వాళ్లకు 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు, ఈ ఘటన అటు రాజకీయ వర్గాల్లోనూ కలవరం రేపుతోంది. ఘటనపై బిజెపి జాతీయ సమాచార, సాంకేతిక విభాగం ఇన్‌ఛార్జ్  అమిత్ మాళవ్య ఘాటుగా స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను ఉంచి ట్వీట్ చేసిన మాళవ్య సీఎం భూసేష్ బాఘెల్ మీద విమర్శలు గుప్పించారు.  ముఖ్యమంత్రి భూసేష్ నేతృత్వంలో రాష్ట్రంలో హిందువులపై ఇది రెండో అరాచక ఘటన అని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌‌ఘఢ్‌లోని జష్‌పూర్‌లో హిందూ మతపరమైన ఊరేగింపుపై వేగంగా వాహనం నడపి భక్తుల్ని నిర్ధాక్ష్యణ్యంగా చంపడం అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ఇలాఉండగా, అసలు ఎందుకు భక్తుల మీదకి కారు వేగంగా నడపాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన పనేనా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్