Corona Effect On Holi: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌… ఢిల్లీలో మూడు రోజులపాటు లాక్‌డౌన్‌.?

Corona Effect On Holi: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందా.? అంటే పరిస్థితితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసుల సంఖ్యతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోందా. అన్న అనుమానాలు...

Corona Effect On Holi: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌... ఢిల్లీలో మూడు రోజులపాటు లాక్‌డౌన్‌.?
Corona Effect On Holi
Follow us

|

Updated on: Mar 23, 2021 | 12:15 PM

Corona Effect On Holi: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైందా.? అంటే పరిస్థితితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసుల సంఖ్యతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోందా. అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా చోట్ల కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కూడా విధించారు. ఇదిలా ఉంటే తాజాగా హోళీ వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. హోలీ సందర్భంగా ఇప్పటికే ఢిల్లీలో ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హోలీ వేడుకల్లో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి. మళ్లీ కేసులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. ఢిల్లీలో ఈ నెల 28,29,30న లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గుజరాత్‌, ఒడిశాలో కూడా ఇప్పటికే హోలీ వేడుకలపై నిషేధం విధించారు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 46,951 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నుంచి భారత్‌లో హయ్యస్ట్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,46,081కి చేరింది. ఇందులో 3,34,646 యాక్టివ్ కేసులు ఉండగా, 1,11,51,468 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Also Read: Coronavirus Pandemic : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా వైరస్.. అక్కడ మాస్కులు లేకుండా తిరిగారో పోలీసులకు ఫైన్ కట్టాల్సిందే…!

కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. జాగ్రత్తగా ఉండండి: కర్ణాటక మంత్రి హెచ్చరిక

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. రెండు లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు..