AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gallantry awards: 80 మంది సైనికులకు శౌర్య పురస్కారం, ఆరుగురికి కీర్తి చక్ర, 16 శౌర్య చక్ర అవార్డుల ప్రకటన

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80 మంది సైనికులకు శౌర్య పురస్కారాలను ప్రకటించారు. వీరిలో 12 మంది సైనికులకు మరణానంతరం ఈ శౌర్య పురస్కారాన్ని అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన్ నుండి గ్యాలంట్రీ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన 80 మంది సైనికులలో ఆరుగురికి కీర్తి చక్ర, 16 మంది ధైర్యవంతులకు శౌర్య చక్ర ప్రదానం చేయనున్నారు.

Gallantry awards: 80 మంది సైనికులకు శౌర్య పురస్కారం, ఆరుగురికి కీర్తి చక్ర, 16 శౌర్య చక్ర అవార్డుల ప్రకటన
Gallantry Awards 2024
Balaraju Goud
|

Updated on: Jan 25, 2024 | 9:31 PM

Share

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80 మంది సైనికులకు శౌర్య పురస్కారాలను ప్రకటించారు. వీరిలో 12 మంది సైనికులకు మరణానంతరం ఈ శౌర్య పురస్కారాన్ని అందజేయనున్నారు. రాష్ట్రపతి భవన్ నుండి గ్యాలంట్రీ అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన 80 మంది సైనికులలో ఆరుగురికి కీర్తి చక్ర, 16 మంది ధైర్యవంతులకు శౌర్య చక్ర ప్రదానం చేయనున్నారు. 53 మంది సైనికులకు సేన పతకాన్ని అందజేయనున్నారు. ఒక సైనికుడికి నేవీ మెడల్, 4 ఎయిర్ ఫోర్స్ మెడల్స్ ఇవ్వనున్నారు.

శౌర్య పురస్కారాలతో పాటు, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం, యుద్ధ పతకాన్ని కూడా ప్రకటించారు. ఇందుకోసం 311 మంది పేర్లను ఎంపిక చేశారు. వీరిలో 31 మందిని పరమ విశిష్ట సేవా పతకానికి, నలుగురు ఉత్తమ్ యుద్ధ సేవా పతకానికి, 59 మందిని అతి విశిష్ట సేవా పతకానికి, 10 మందిని యుద్ధ సేవా పతకానికి ఎంపిక చేశారు. వీటిలో 38 ఆర్మీ పతకాలు, 10 నేవీ మెడల్స్, 14 ఎయిర్ ఫోర్స్ మెడల్స్ ఇవ్వనున్నారు. ఇది కాకుండా, విశిష్ట సేవా పతకానికి 130 పేర్లను ప్రకటించారు.

కీర్తి చక్ర అవార్డు గ్రహీతలు

ఈ ఏడాది ఆరుగురు సైనికులకు కీర్తి చక్ర ప్రదానం చేయనున్నారు. వీటిలో మొదటి పేరు మేజర్ దిగ్విజయ్ సింగ్ రావత్, అతను 21 బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్స్) నుండి వచ్చారు. ఇందులో రెండో పేరు సిక్కు రెజిమెంట్‌లోని 4వ బెటాలియన్‌లో ఉన్న మేజర్ దీపేంద్ర విక్రమ్. పంజాబ్ రెజిమెంట్‌లోని ఆర్మీ మెడికల్ కార్ప్ 26వ బెటాలియన్‌లో పోస్ట్ చేసిన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ పేరు కూడా ఈ జాబితాలో చేర్చారు. మరణానంతరం ఈ అవార్డుతో వీరిని గౌరవిస్తోంది భారత ప్రభుత్వం. దీంతో పాటు మెహర్ రెజిమెంట్‌కు చెందిన 21వ బెటాలియన్‌కు చెందిన పవన్ కుమార్ యాదవ్‌కు కూడా కీర్తి చక్ర లభించనుంది. పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన హవల్దార్ అబ్దుల్ మజీద్‌కు మరణానంతరం కీర్తి చక్ర, రాష్ట్రీయ రైఫిల్స్ 55 బెటాలియన్ సభ్యుడు పవన్ కుమార్‌కు మరణానంతరం కీర్తి చక్ర ప్రదానం చేయనున్నారు.

శౌర్యచక్ర అవార్డు గ్రహీతలు

1. మేజర్ మానేవ్ ఫ్రాన్సిస్, 21వ బెటాలియన్, పారాచూట్ రెజిమెంట్ (స్పెషల్ ఫోర్స్)

2. మేజర్ అమన్‌దీప్ ఝాకర్, 4వ బెటాలియన్ ది సిక్కు రెజిమెంట్

3. కెప్టెన్ MV ప్రాంజల్, 63 కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, రాష్ట్రీయ రైఫిల్స్ (మరణానంతరం)

4. కెప్టెన్ అక్షత్ ఉపాధ్యాయ, 20 బెటాలియన్, జాట్ రెజిమెంట్

5. నాయబ్ సుబేదార్ సంజయ్ కుమార్ భన్వర్ సింగ్, 21 బెటాలియన్, మహర్ రెజిమెంట్

6. హవల్దార్ సంజయ్ కుమార్, 9 అస్సాం రైఫిల్స్ ఆర్మీ

7. రైఫిల్‌ మ్యాన్ అలోక్ రావ్, 18 అస్సాం రైఫిల్స్ (మరణానంతరం) ఆర్మీ

8. శ్రీ పర్షోత్తం కుమార్, C/O 63వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ (సివిలియన్)

9. లెఫ్టినెంట్ బిమల్ రంజన్ బెహెరా, నేవీ

10. వింగ్ కమాండర్ శైలేష్ సింగ్, ఫ్లయింగ్ (పైలట్) ఎయిర్ ఫోర్స్

11. ఫ్లైట్ లెఫ్టినెంట్ హృషికేష్ జయన్ కరుతాదత్, ఫ్లయింగ్ (పైలట్) ఎయిర్ ఫోర్స్

12. బిభోర్ కుమార్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్, 205 కోబ్రా CRPF

13. మోహన్ లాల్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జమ్మూ కాశ్మీర్ పోలీస్

14. అమిత్ రైనా, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, జమ్మూ కాశ్మీర్ పోలీస్

15. ఫరోజ్ అహ్మద్ దార్, సబ్ ఇన్‌స్పెక్టర్, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్

16- కానిస్టేబుల్ వరుణ్ సింగ్ జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…