వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టంతో భారీగా ఫైన్లు పెరగడమే కాకుండా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా పునరుద్దరించడంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త వాహన చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కోసం గడువు ముగియడానికి ఆర్నెళ్ల లోపు.. లేదా గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే తప్పితే.. గడువు ముగిసిన ఏడాది తర్వాత రెన్యూవల్ కోసం దరఖాస్తు చేస్తే మాత్రం.. […]

వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Follow us

|

Updated on: Oct 30, 2019 | 1:36 PM

మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టంతో భారీగా ఫైన్లు పెరగడమే కాకుండా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా పునరుద్దరించడంలో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త వాహన చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కోసం గడువు ముగియడానికి ఆర్నెళ్ల లోపు.. లేదా గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే తప్పితే.. గడువు ముగిసిన ఏడాది తర్వాత రెన్యూవల్ కోసం దరఖాస్తు చేస్తే మాత్రం.. లెర్నింగ్ టెస్టును మరోసారి పూర్తి చేయాల్సి వస్తుంది. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత ఒక నెల గ్రేస్ పీరియడ్ నిబంధనను కూడా కేంద్రం రద్దు చేసింది.

లైసెన్స్ గడువు ముగిసి ఏడాది గడిచినట్లయితే.. సదరు వ్యక్తి తప్పుకుండా మళ్ళీ లెర్నింగ్ టెస్టుకు హాజరు కావాల్సిందే. తద్వారా అతన్ని అధికారులు కొత్త వ్యక్తిగానే పరిగణలో తీసుకుంటారు. అంతేకాకుండా వీరికి కొత్త లెర్నర్ దరఖాస్తుదారుల మాదిరిగానే బయోమెట్రిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ దరఖాస్తుదారులు తమ గుర్తింపు, నివాస పాత్రలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు రవాణా రహిత వాహనదారులకు జారీ చేసే లైసెన్స్ చెల్లుబాటు వారి వయసుపై ఆధారపడి ఉంటుంది.

అటు రవాణా వాహనాలు నడపడానికి లైసెన్స్ గడువు 5 సంవత్సరాలు వరకు ఉండగా.. ప్రమాదకరమైన వాహనాలకు 3 సంవత్సరాలు ఉంటుంది. వీరికి లైసెన్స్ గడువు ముగియడానికి ఏడాదికి ముందే పునరుద్దిరించుకొనే అవకాశం ఉంది. అంతేకాక ఆటో, కారు, బస్, లారీ వంటి రవాణా వాహనాన్ని నడపడానికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఇక నుండి ఎటువంటి విద్యార్హత అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది...
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.