నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు.. ఎందుకంటే?
పక్క రాష్ట్రం కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందనే కారణంగా యువతిని నడి రోడ్డుపై అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. అనంతంరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. తనను ప్రేమను నిరాకరించదనే కారణంగా బంట్వాల్ బీసీ రోడ్‌లోని KSRTC బస్‌స్టాండ్‌లో 21 ఏళ్ల యువతి లావణ్యపై ఓ యువకుడు కత్తితో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసుకలు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. కక్కేపడవు గ్రామానికి చెందిన లావణ్య అనే యువతి కల్లడ్కాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. అయితే రోజులాగే పని ముగించుకొని ఇంటికి బయల్దేరిన లావణ్య కక్కేడపు బస్సు ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి కిందకు దిగింది. అదే సమయంలో ఆమెకు దూరపు బంధువైన చేతన్ కూడా బస్సు దిగాడు. ఆ వెంటనే కత్తితో లావణ్యపై దాడి చేసి అక్కడి నుంచి పరాయాడు. అది గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన లావణ్యను స్థానికులు వెంటనే బంట్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే దాడి చేసిన అనంతరం నిందితుడు ఆయుధాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పాటు అవి ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.ఇక స్థానికు సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే లావణ్య తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతోనే ఈ కేతన్ అనే యువకుడు ఈ దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
