AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

First Hydrogen Train: తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Hydrogen Train
Venkatrao Lella
|

Updated on: Jul 17, 2026 | 11:43 AM

Share

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ట్రైన్ ప్రారంభించారు. జూలై 17న ఉదయం 11 గంటల సమయంలో హర్యానాలోని జింద్-సోనిపత్ మార్గంలో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.  ఎలాంటి కార్బన్ ఉద్గారాలను విడుదల చేయని ఈ ట్రైన్‌తో పర్యావరణానికి ఎంతో మేలు చేకూరనుంది. కేవలం  రూ. 5 నుండి ఈ రైలులో ఛార్జీలు ప్రారంభమవుతాయి.  ఛార్జీలు కేవలం రూ. 5 నుండి ప్రారంభమై రూ. 25 వరకు ఉంటాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ అవకాశాన్ని అందించనుంది. దీని ప్రారంభ ఛార్జీ, అనేక రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ఛార్జీల కంటే కూడా తక్కువ.

ఈ రైల్లో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. జింద్- సోనిపత్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మార్గంలో 11 చోట్ల ఆగుతుంది. రోజుకు సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లనుంది. దీనిని స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు లేకుండా నడుస్తుంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే డీజిల్ రైళ్లలా కాకుండా.. ఈ హైడ్రోజన్ రైలు కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ రైలును నడపడానికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్‌ను జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ నుండి సరఫరా చేస్తారు. సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారించడానికి ఈ ప్రాజెక్ట్‌లో అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

ప్రత్యేకతలు ఇవే..

విలాసవంతమైన సీట్లు ఉంటాయి. హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్షన్ సిస్టమ్‌లు, నిరంతర వెంటిలేషన్, ఆటోమేటెడ్ హైడ్రోజన్ షట్-ఆఫ్ మెకానిజమ్‌లు, లోకోమోటివ్ పైలట్‌ల కోసం రియల్-టైమ్ హెల్త్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. అత్యంత సౌకర్యవంతంగా ఇందులో ప్రయాణం చేయవచ్చు.

వీడియో చూడండి

Follow Us
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం!
అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం!
డ్వాక్రా సంఘంలో ఎలా చేరాలి? అర్హతలు ఏంటి..?
డ్వాక్రా సంఘంలో ఎలా చేరాలి? అర్హతలు ఏంటి..?
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
గుప్త నవరాత్రుల్లో ఈ వస్తువులను దానం చేయండి.. అమ్మవారి అనుగ్రహంతో
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. తెగ సంబరపడుతున్న మగానుభావులు
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
మ్యాచ్ మధ్యలో బాంబ్ పేల్చిన గంభీర్.. కోహ్లీతోపాటు రోహిత్ ఎమోషన్
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
గానుగలో తీసిన కొబ్బరి నూనె.. రిఫైన్డ్ ఆయిల్ కంటే మంచిదా..?
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో నల్లగొండ ఉపాధ్యాయుడి బాలగేయం..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
రక్తహీనతను చిటికెలో తగ్గించే నేచురల్ పొడి.. ఒక్క చెంచాడు చాలు..
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి