AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం! ఇదిగో వీడియో..

యూపీలోని ఆగ్రాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో మంచు లింగం ఆకారం దర్శనమిచ్చింది. ఢీ ఫ్రిజ్‌లోని శివలింగం ఆకారంలో కనిపించిన మంచు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు దానిని పూజించడం స్టార్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం! ఇదిగో వీడియో..
Agra Fridge Shivling Video
Anand T
|

Updated on: Jul 17, 2026 | 11:31 AM

Share

ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో యూపీలోని ఓ ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో శివలింగం ఆకారంలో మంచు పేరుకున్న ఘటన సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగ్రాలోని ఓ ఇంట్లో ఫ్రిజ్‌లో మంచు శివలింగం ఆకారంలో గడ్డకట్టి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. దాన్ని నిజమైన శివలింగంగా భావించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అదికాస్త ఆనోటా ఇలానో స్థానికులకు తెలియడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టు పక్కల జనాలంతా వారి ఇంటికి క్యూ కట్టారు.

అలాగే ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. వైరల్ వీడియో ప్రకారం.. స్థానిక జనాలంతా వాళ్ల ఇంటికి చేరుకొని ప్రిజ్‌లో శివలింగం ఆకారంలో ఉన్న మంచు గడ్డకు పూజలు చేయడం, జలాభిషేకం నిర్వహించడం, నైవేద్యాలు సమర్పించడంతో పాటు హర హర మహాదేవ్ అంటూ భక్తి కీర్తనలు పాడడం కూడా మనం చూడవచ్చు.

అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.. కొందరు ఫ్రిజ్‌లో ఈ మంచు నిర్మాణాన్ని దైవ సంకేతంగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం ఫ్రిజ్‌లో గడ్డకట్టే మంచు గడ్డ మాత్రమేనని కొట్టి పారేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ ఒక్కసారి కరెంటు పోతే ఆ ఆకారం ఏమవుతుందో చూద్దాం అంటూ కామెంట్ చేయగా.. పాత తరం మాన్యువల్ డీఫ్రాస్ట్ ఫ్రిజ్‌లలో ఇలాంటి మంచు ఆకారాలు ఏర్పడటం సాధారణమేనని మరో యూజర్ కామెంట్ చేశారు.. నా ఇంట్లో కూడా ఇలా చాలాసార్లు జరిగిందని రాసుకొచ్చాడు.

అమర్‌నాథ్ యాత్రతో పోలికలు

ఇదిలా ఉండగా.. ఈ ప్రిజ్‌లో ఏర్పడిన మంచు లింగం ఆకారాన్ని కొందరు అమర్నాథ్‌లో ఏర్పడే మంచు శివలింగంతో పోల్చుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అచ్చం అమర్‌నాథ్‌లో సైతం ఇలాంటి ప్రక్రియే జరుగుతుందని అతను కామెంట్ చేశాడు. నార్మల్‌గా ప్రిజ్‌లో ఏర్పడిన ఈ ఆకారాన్ని చూశాక, అమర్‌నాథ్ మంచు లింగం వెనుక ఉన్న అంతర్యం ఏంటనేది ప్రజలకు ఊహకే వదిలేస్తున్నానని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన