AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా..!?

Pinda Pradanam: భారతీయ సంప్రదాయంలో, మరణించిన వారి ఆత్మ శాంతి కోసం కాకులకు పిండ ప్రదానం చేయడం ఒక ముఖ్యమైన ఆచారం. కాకులలోనే మరణించిన వారి ఆత్మలు ఉంటాయని హిందువులు నమ్ముతారు. ఈ ఆచారం వెనుక మృతుల కోరికలు, సంతోషం, అలాగే యమధర్మరాజు ఇచ్చిన వరం వంటి కారణాలు ఉన్నాయి.

Rajashekher G
|

Updated on: Jul 17, 2026 | 1:50 PM

Share
భారతదేశం ఒక ఆధ్యాత్మిక, సాంప్రదాయ దేశంగా ప్రపంచవ్యాప్తంగా  గౌరవించబడుతుంది. మన ఆచారాలు, పద్ధతులకు శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో కొన్ని శాస్త్రీయ కారణాలతో కూడుకున్నవి కాగా, మరికొన్ని ఆచారాలు పద్ధతులు మానవులకు ఎన్నో ఉపయోగాలు కలిగి ఉన్నాయి. మరణానంతర కర్మల్లో భాగంగా పిండ ప్రదానం చేయడం హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం. ఈ పిండ ప్రదానాన్ని కేవలం కాకులకు మాత్రమే పెట్టడం ఒక విశిష్ట ఆచారం.

1 / 5
సాధారణంగా కాకులను చెడు శకునంగా భావించినప్పటికీ.. పిండ ప్రదానం వాటికే చేయడం వెనుక కొన్ని లోతైన నమ్మకాలు ఉన్నాయి. ప్రధానంగా, మరణించిన వారి ఆత్మలు కాకులలోనే ఉంటాయని హిందువులు బలంగా విశ్వసిస్తారు. అందుకే, ఎవరైనా మరణించిన తర్వాత పదిహేను రోజులలోపు వారి ఇంటి దగ్గరికి  కాకులు వస్తే, అది వారి ఆత్మే వచ్చిందని నమ్ముతారు. కాకులకు అన్నం పెట్టడం ద్వారా ఆ ఆత్మలకు శాంతి చేకూరుతుందని భావిస్తారు.

2 / 5
ఒకవేళ కాకులు పెట్టిన అన్నాన్ని తినకపోతే, మరణించిన వారి ఆత్మలు సంతోషంగా లేవని లేదా వారికి ఏదో కోరికలు నెరవేరలేదని విశ్వసిస్తారు. ఈ నమ్మకాలకు నిర్దిష్ట ఆధారాలు లేనప్పటికీ, ఇది తరతరాలుగా వస్తున్న ఒక బలమైన ఆచారంగా కొనసాగుతుంది. ఈ ఆచారానికి మరొక కారణం కూడా ఉంది. పూర్వం యమధర్మరాజు, నరకంలో బాధలను అనుభవించే వారికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు. కాకులు ఎవరి పిండం తింటే వారికి విముక్తి లభిస్తుందని ఆ వరం. ఈ కారణంగా కూడా ఈ పిండ ప్రదానం ఆచారం అప్పటినుంచి కొనసాగుతూ వస్తుంది.

3 / 5
యమధర్మరాజు కాకులకు ఆ వరం ఎందుకిచ్చాడంటే..?.. ఒకానొక సందర్భంలో రావణాసురుడు యమలోకంపై దాడి చేసి యముడి కోసం వెతుకుతుండగా.. యముడు కాకి రూపంలో దాక్కుని అతడి నుంచి తప్పించుకుంటాడు. యముడు కాకి రూపంలో ఉండటంతో రావణాసురుడు అతడిని గుర్తించలేదు. దీంతో అక్కడ్నుంచి రావణాసురుడు వెళ్లిపోతాడు. ఆ తర్వాత యముడు తన రూపాన్ని తిరిగి పొందుతాడు. కాకి రూపంలో తాను రక్షణ పొందిన కారణంగా.. యముడు కాకులకు ఈ వరం ఇచ్చాడని పురాణ కథనం.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!