AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్ఓ కఠిన నిబంధన.. అంతకంటే ముందే ఉద్యోగం మానేస్తే డబ్బుల కోసం మూడేళ్లు ఆగాల్సిందే..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందనే విషయం తెలిసిందే. 10 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తి చేస్తే 58 ఏళ్ల తర్వాత మీకు ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. ఒకవేళ 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయకపోతే పెన్షన్ సొమ్ము కోల్పోతామని చాలామంది అనుమానపడుతుంటారు.

EPFO: ఈపీఎఫ్ఓ కఠిన నిబంధన.. అంతకంటే ముందే ఉద్యోగం మానేస్తే డబ్బుల కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jul 17, 2026 | 1:44 PM

Share

ఈపీఎఫ్‌వో పెన్షన్ రూల్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 స్థానంలో కొత్త ఈపీఎస్ 2026 పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. జూన్ 29, 2026 నుండి ఈ కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది. పెన్షన్ విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. పెన్షన్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి ఉద్యోగం మానేసే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛను పొందాలంటే.. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న కంపెనీల్లో కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తికాకముందే ఉద్యోగం మానేస్తే నెలవారీ పింఛనుకు అర్హులు కారు.

ఉద్యోగం మానేస్తే పెన్షన్ తీసుకోవచ్చా..?

అయితే 10 ఏళ్ల కంటే తక్కువ పీరియడ్ ఉంటే ఉద్యోగులు తమ డబ్బును కోల్పోతామని భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వారికి రెండు అద్భుతమైన ఆప్షన్లను అందించింది. అందులో మొదటిది ‘విత్‌డ్రాయల్ బెనిఫిట్’ కింద తమ డబ్బును ఒకేసారి ఉద్యోగం మానేశాక తీసుకోవచ్చు. రెండవ ఎంపిక ‘స్కీమ్ సర్టిఫికేట్’. భవిష్యత్తులో మీరు EPFO ​​పరిధిలోకి వచ్చే కంపెనీలో తిరిగి ఉద్యోగంలో చేరితే మీ పాత ఉద్యోగ కాలాన్ని మీ కొత్త ఉద్యోగానికి జోడించడానికి ఈ సర్టిఫికేట్‌ను ఉపయోగిస్తారు. దీనివల్ల 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేయడం సులభం అవుతుంది. కొత్త పెన్షన్ పథకం 2026లో పెన్షన్ విత్ డ్రాలకు సంబంధించి సరికొత్త నిబంధన విధించారు. ఒక ఉద్యోగి తన పదవీ విరమణ వయస్సుకు ముందే ఉద్యోగాన్ని విడిచిపెడితే వారు తమ పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోలేరు. చివరి పెన్షన్ కాంట్రిబ్యూషన్ జమ అయిన తేదీ నుండి 3 ఏళ్లు గడిచిన తర్వాత మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

పెన్షన్ వెంటనే విత్ డ్రా ఎప్పుడు చేసుకోవచ్చు..?

అయితే ఈ మూడేళ్ల కాలంలో మీరు పదవీ విరమణ వయస్సుకు చేరుకుంటే వేచి ఉండాల్సిన అవసరం లేదు. పెన్షన్ డబ్బును వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. కొత్త పథకంలో కేంద్రం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంప్లాయర్, ఎంప్లాయి కాంట్రిబ్యూషన్‌ను విత్ డ్రా చేసుకునే అవకాశం. పీఎఫ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వాారా పెళ్లి, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ ఈఎంఐ, చదువు, అనారోగ్య సమస్యలు వంటి కారణాలతో పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మినిమం 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాలనే నిబందన పెట్టింది. ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది.

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!