AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Mark On Currency Notes: పది రూపాయల నోట్లపై స్టార్‌ గుర్తు ఉంటే అవి నకిలీవా? దీనిలో నిజమెంత

కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. దీంతో సామాన్యులు ఏది నిజం.. ఏది అబద్ధమో తెలుసుకోలేక అవస్థలు పడుతుంటారు. అటువంటి తప్పుడు సమాచారంలో ఒకటి పది రూపాయల నోటు నకిలీదా? కాదా? అనే గుర్తించే ట్రిక్‌. దీంతో చాలా మంది ఇటువంటి నోట్ల విషయంలో పొరబడుతున్నారు. పది రూపాయల నోటుపై ఉండే నక్షత్రం గుర్తు నకిలీ నోటుకు సంకేతమా..? అందులో నిజమెంత, అసలు ఈ నోట్లపై నక్షత్రం వేయడం వెనుక ఉన్న కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Star Mark On Currency Notes: పది రూపాయల నోట్లపై స్టార్‌ గుర్తు ఉంటే అవి నకిలీవా? దీనిలో నిజమెంత
Star Mark On Currency Notes
Srilakshmi C
|

Updated on: Nov 27, 2023 | 12:14 PM

Share

న్యూఢిల్లీ, నవంబర్ 27:  కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. దీంతో సామాన్యులు ఏది నిజం.. ఏది అబద్ధమో తెలుసుకోలేక అవస్థలు పడుతుంటారు. అటువంటి తప్పుడు సమాచారంలో ఒకటి పది రూపాయల నోటు నకిలీదా? కాదా? అనే గుర్తించే ట్రిక్‌. దీంతో చాలా మంది ఇటువంటి నోట్ల విషయంలో పొరబడుతున్నారు. పది రూపాయల నోటుపై ఉండే నక్షత్రం గుర్తు నకిలీ నోటుకు సంకేతమా..? అందులో నిజమెంత, అసలు ఈ నోట్లపై నక్షత్రం వేయడం వెనుక ఉన్న కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

పది రూపాయల నోటుపై నక్షత్రం గుర్తు ఉంటే దానిని నకిలీ నోటుగా పరిగణించాలనేది సదరు వార్త సారాంశం. దీని ఫలితంగా చాలా మంది అలాంటి నోట్లను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. ఈ నోట్లు నకిలీవని వారు భావిస్తున్నారు. నిజంగానే నక్షత్రం గుర్తు ఉన్న నోట్లు నకిలీవా? అనంటే కాదని సమాధానం చెప్పాలి. నక్షత్రం గుర్తు ఉన్న నోట్లు నకిలీవి కావు. ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా విడుదల చేసింది. భారత ప్రభుత్వం ఈ ప్రత్యేక నోట్లను చలామణిలో అనుమతిస్తుంది. ఈ స్టార్ గుర్తు రూ. 10, రూ. 20 వంటి నోట్లలో కనిపిస్తుంది. ఆ తర్వాత రూ.500 నోట్లలో కూడా నక్షత్రం గుర్తులను ముద్రించడం ప్రారంభించారు. వీటిని ప్రభుత్వమే ముద్రించింది. అయితే కొందరు వ్యక్తులు జనాల్లో గందరగోళం సృష్టించడానికి నక్షత్రం గుర్తు ఉన్న నోట్లు నకిలీవిగా ప్రచారం చేస్తున్నారు. ఇకపై పది, 20 రూపాయల నోట్ల విషయంలో ఇటువంటి అపోహలను నమ్మకండి.

అసలు కరెన్సీ నోట్లపై స్టార్‌ గుర్తు ఎందుకు వేస్తారంటే..

కరెన్సీ నోట్లలోని సంఖ్యల మధ్య ఉన్న నక్షత్రం గుర్తు ఉంటే నకిలీ కాదనే విషయం ఇప్పుడు మీకు అర్ధం అయ్యి ఉంటుంది. అయితే అసలు కరెన్సీ నోట్లపై స్టార్‌ గుర్తు ఎందుకు వేస్తారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి, 2006 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ మార్క్‌ను నోట్లపై ముద్రించడం ప్రారంభించింది. 2006 సంవత్సరంలో ఈ స్టార్ నోట్లను తొలిసారిగా రూ.10, 20, 50, 100 నోట్లపై ముద్రించారు. ఆ తర్వాత ఇది చట్టబద్ధమైన టెండర్‌గా గుర్తింపు పొందింది. ఆ సమయంలో దీనిని RBI మహాత్మా గాంధీ సిరీస్ రూపంలో ప్రారంభించింది. అలాంటి నోట్లను మహాత్మా గాంధీ సిరీస్‌లో ముద్రించారు. ఈ నక్షత్రం గుర్తు నెంబర ప్యానెల్‌లో ఇంగ్లిష్‌ అక్షరం, నోట్ల సిరీస్‌ నెంబర్‌ మధ్య ముద్రిస్తారు. ఆ తర్వాత 2016 సంవత్సరంలో దీని పరిధిని పెంచారు. 500 రూపాయల నోట్లపై కూడా నక్షత్రం గుర్తును ముద్రించడం ప్రారంభించారు. దీంతో రూ.500 స్టార్ నోట్లు కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాయి. అంటే ఇప్పుడు రూ.10 నుంచి రూ.500 వరకు కరెన్సీ నోట్లపై నక్షత్రం గుర్తు ఉంటుందన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..