రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ లకు బీజేపీలో సంస్థాగత పదవులు..? ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వ్యూహకర్తలు ..?
మాజీ కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ లకు బీజేపీలో కీలకమైన సంస్థాగత పదవులు లభించే సూచనల కనిపిస్తున్నాయని అంటున్నారు.
మాజీ కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ లకు బీజేపీలో కీలకమైన సంస్థాగత పదవులు లభించే సూచనల కనిపిస్తున్నాయని అంటున్నారు. పార్టీలో వీరిని జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో నియమించవచ్చునని తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీని గెలిపించే బృహత్తర బాధ్యతను వీరిపై మోపవచ్చు.. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు ప్రకటన చేయవచునని అంటున్నారు. ఈ నెల 7 న జరిగిన ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వీరితో బాటు 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఆ రోజున 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే యూపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇక ఉత్తరాఖండ్ లో తరచూ ముఖ్యమంత్రులను మార్చవలసి వస్తోంది.
ఈ నేపథ్యంలో.. ప్రధానంగా పంజాబ్ పై దృష్టి సారించాలని బీజేపీ భావిస్తోంది. అయితే రైతుల నిరసనల మధ్య ముఖ్యంగా అక్కడ బీజేపీ అధికారంలోకి రావడం కల్లే అంటున్నారు. వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేయాలంటూ వారు నేటికీ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఏమైనా ఈ రాష్ట్రాల్లో కమల వికాసం జరిగేలా ఈ మాజీ మంత్రులు వ్యూహకర్తలుగా కీలక పాత్ర వహించవచ్చునని పార్టీ భావిస్తోంది. ఇక 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీరి రోల్ ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆధార్ కార్డు హోల్డర్స్‌కు షాకింగ్ న్యూస్..!! ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి ( వీడియో )
CM Stalin: పొలిటికల్ స్పైస్ మిస్సైంది..! హుందాతనమైన రాజకీయ పరిమళాల ఆస్వాదనలో తమిళ తంబీలు.?