రేప్ కేసు బాధితురాళ్లకు న్యాయం జరగాలి, ఢిల్లీ మహిళా కమీషన్

ఢిల్లీలో 12 ఏళ్ళ బాలికపై గత ఆగస్టులో అత్యాచారం జరిగిందని, ఆమె ఇప్పటికీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతోందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్శన్ స్వాతి మలివాల్ అన్నారు. అలాగే ఈ  నెల 7 న 90 ఏళ్ళ వృధ్ధురాలిపై కూడా రేప్ జరిగిందని ఆమె తెలిపారు.

  • Umakanth Rao
  • Publish Date - 7:49 pm, Wed, 9 September 20
రేప్ కేసు బాధితురాళ్లకు న్యాయం జరగాలి, ఢిల్లీ మహిళా కమీషన్

ఢిల్లీలో 12 ఏళ్ళ బాలికపై గత ఆగస్టులో అత్యాచారం జరిగిందని, ఆమె ఇప్పటికీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతోందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్శన్ స్వాతి మలివాల్ అన్నారు. అలాగే ఈ  నెల 7 న 90 ఏళ్ళ వృధ్ధురాలిపై కూడా రేప్ జరిగిందని ఆమె తెలిపారు. హాస్పిటల్ లో ఈ బాధితురాళ్లను తాను పరామర్శించానని , ఆ మృగాళ్లకు మరణ శిక్ష పడేలా చూడాలని వారు కోరారని ఆమె పేర్కొన్నారు. వీరికి న్యాయం జరిగేందుకు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు వీరి అభ్యర్థనలు వెళ్లేలా చూడాలని, రేపిస్టులకు ఉరి  శిక్ష పడాలని ఆమె అన్నారు. ఈ మేరకు తాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశానన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.