AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేశాం, ఇక మిగిలిందేమీ లేదు’

ముంబైలో అక్రమ నిర్మాణాలన్నీకూల్చివేశామని,  ఇక కంగనా రనౌత్ ఆఫీసుకు సంబంధించి మిగిలిన కూల్చివేత పనులేవీ లేవని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

'అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేశాం, ఇక మిగిలిందేమీ లేదు'
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 09, 2020 | 7:32 PM

Share

ముంబైలో అక్రమ నిర్మాణాలన్నీకూల్చివేశామని,  ఇక కంగనా రనౌత్ ఆఫీసుకు సంబంధించి మిగిలిన కూల్చివేత పనులేవీ లేవని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఆమె కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఇంకా పడగొట్టే పనులన్నీ ముగిశాయని వారు చెప్పారు. అయితే ఇంటి యజమానులు లేనప్పుడు హడావుడిగా ఎందుకు కూల్చివేశారన్న ప్రశ్నకు వారు తెల్ల మొహం వేశారు. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. బాంద్రా ఏరియాలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిలో ఈ కార్యాలయం కూడా ఒకటని వారు పేర్కొన్నారు. కాగా- ఈ కూల్చివేత వ్యవహారం కంగనాకు, శివసేనకు మధ్య పెద్ద రచ్ఛకు దారితీసింది.

Follow Us