AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: మహోన్నత మూర్తికి రంగుల నివాళి.. రంగోలి కళాకారుడి అద్భుతం..!

టాటాపై ఉన్న అభిమానంతో రంగోలి కళాకారుడు రంగులతో నివాళి అర్పించారు. ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మెట్రో స్టేషన్‌లో వేసిన రతన్‌ టాటా నివాళి చిత్రం ఎంతో ఆకట్టుకుంటోంది.

Ratan Tata: మహోన్నత మూర్తికి రంగుల నివాళి.. రంగోలి కళాకారుడి అద్భుతం..!
Colorful Tribute To Ratan Tata
Jyothi Gadda
| Edited By: |

Updated on: Oct 14, 2024 | 6:40 PM

Share

దేశ పారిశ్రామిక రంగానికి దిశ నిర్దేశం చేసిన లెజెండరీ ఇండస్ట్రీలియస్ట్ రతన్ టాటా మరణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను కంటతడి పెట్టింది. 86 ఏళ్ల రతన్ టాటాను కోల్పోవడం భారతదేశానికే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లోని అనేక బాడా బాడా సంస్థలకు సైతం బాధాకరం. తన విజన్‌తో ఎన్నో రంగాల్లో తనదైన ముద్రను చాటుకొంటూ గణనీయ ప్రగతిని సాధించిన మహోన్నత వ్యక్తి రతన్‌ టాటా. ఆ మహనీయుడికి నివాళి వెల్లువ కొనసాగుతోంది. టాటాపై ఉన్న అభిమానంతో రంగోలి కళాకారుడు రంగులతో నివాళి అర్పించారు. ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మెట్రో స్టేషన్‌లో వేసిన రతన్‌ టాటా నివాళి చిత్రం ఎంతో ఆకట్టుకుంటోంది.

అక్టోబర్‌09 బుధవారం రోజన తుది శ్వాస విడిచిన 86 ఏళ్ల రతన్‌ టాటాకు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన రంగోలి కళాకారుడు అక్షయ్ జలీహాల్ వినూత్నంగా నివాళి అర్పించారు. నాడప్రభు కెంపేగౌడ మెట్రో స్టేషన్‌లో రంగు రంగుల ముగ్గులతో ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దారు. నీలిరంగు బ్లేజర్‌తో రతన్‌ టాటా పోర్ట్రెయిట్ వేశారు. వెనుక ఉన్న మెట్లపై ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉంది. కాగా, రతన్ టాటా రంగుల నివాళి చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఇవి కూడా చదవండి

కాగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని పోస్ట్‌ చేశారు. బెంగళూరుకు చెందిన రంగోలి కళాకారుడు అక్షయ్ జలీహాల్ పోస్ట్‌ చేసిన ఈ చిత్రానికి క్యాప్షన్‌గా ‘వియ్‌ మిస్‌ యూ, వియ్‌ లవ్‌ యూ’ అంటూ పేర్కొన్నారు. రతన్ టాటా అందరికీ స్ఫూర్తిదాయకమంటూ పలు ట్యాగ్‌లు ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..