Air India: విమానంలో సాంకేతిక లోపం.. గంటన్నరకుపైగా గాల్లో చక్కర్లు.. చివరకు ఏం జరిగిందంటే..
తమిళనాడు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ దగ్గర హైటెన్షన్ సిట్యుయేషన్ కొనసాగింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్యను గుర్తించిన వెంటనే పైలట్ ఎమెర్జెన్సీ ప్రకటించారు. దీంతో ఏటీసీని అలర్ట్ చేశారు. రెండున్నర..
తమిళనాడు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ దగ్గర హైటెన్షన్ సిట్యుయేషన్ కొనసాగింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్యను గుర్తించిన వెంటనే పైలట్ ఎమెర్జెన్సీ ప్రకటించారు. దీంతో ఏటీసీని అలర్ట్ చేశారు. రెండున్నర గంటలకుపైగా ఫ్లయిట్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఫ్యూయిల్ బర్నింగ్ ప్రాసెస్ ను కొనసాగించారు ఎయిర్ పోర్టు అధికారులు. దీంతో ఎట్టకేలకు విమానాన్ని తిరుచ్చిలో సేఫ్ గా ల్యాండింగ్ అయ్యింది. దీంతో విమానంలో ఉన్న 140 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, AXB-613 ఎయిర్ ఇండియా ఫ్లయిట్ తిరుచ్చి నుంచి షార్జాకు బయలుదేరుతున్న టైమ్‌లో సడెన్‌గా టెక్నికల్ సమస్య తలెత్తింది. విమానంలో 140 మంది ప్రయాణికులున్నారు. మరోవైపు ఎటీసీ నెట్ వర్క్ అలర్టయింది. ముందు జాగ్రత్తగా తిరుచ్చి ఎయిర్ పోర్టు దగ్గర 20 అంబులెన్స్‌లు..20 ఫైరింజన్‌లు సహా మెడికల్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచారు. భారీగా పారామెడికల్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే సాధారణ ల్యాండింగ్ సాధ్యం కాదని ఏటీసీ చెప్పడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఏటీసీ గైడెన్స్ తో సాంకేతిక లోపాన్ని పైలట్ సరి చేశారు. దీంతో 140 మంది సురిక్షితంగా బయటపడ్డారు.