Ram Janki Temple: రాముడి గుడిని అమ్మేసిన పాకిస్తానీ.. విచారణలో నమ్మలేని నిజాలు.. కొన్నది ఎవరంటే..
Pakistani Nationals Selling Ram Temple: ఆలయంతోపాటు సమీపంలోని ఆస్తిని కూడా అతను మరో వ్యక్తికి అమ్మినట్లుగా కాన్పూర్ అధికారులు గుర్తించారు. దీనిపై స్పందించిన శత్రు ఆస్తుల నిర్వహణ విభాగం అధికారులు..
రామ్‌జానకి దేవాలయాన్ని ఓ పాకిస్తానీయుడు విక్రయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో ఈ ఆలయ విక్రయంపై విచారణ కొనసాగుతోంది. ఆలయంతోపాటు సమీపంలోని ఆస్తిని కూడా అతను మరో వ్యక్తికి అమ్మినట్లుగా కాన్పూర్ అధికారులు గుర్తించారు. దీనిపై స్పందించిన శత్రు ఆస్తుల నిర్వహణ విభాగం అధికారులు.. వాటిని శత్రు ఆస్తులుగా అధికారులు ప్రకటించారు. స్థానికుడు ఒకరు రాములవారి ఆలయాన్ని కొనుగోలు చేసి.. ఆ తర్వాత కూల్చివేసి అదే స్థలంలో హోటల్‌ను నిర్మించినట్లుగా వారు పేర్కొన్నారు. అయితే ఇలా చేసినవారికి అధికారులు నోటీసులు జారీచేశారు. కొనుగోలుచేసిన అతని వారసులకు పలు ప్రశ్నలతో కూడిన నోటీసులు అందించారు. వాటికి రెండు వారాలలోగా సమయం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతానికి తమకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని శత్రు ఆస్తుల విభాగం అధికారులు వెల్లడించారు.
ఆలయాన్ని అమ్మింది ఎవరు..? ఎవరికి అమ్మారు..?
ఉత్తర ప్రదేశ్ కు చెందిన అబిద్ రెహ్మాన్ 1962లో పాకిస్తాన్ కు వలస వెళ్లాడు. ఆ తర్వాత 1982లో తిరిగి వచ్చిన అబిద్ రెహ్మాన్ కాన్పూర్ బెకాన్‌గంజ్‌లోని తన ఆస్తిని.. అతని ఇంటికి సమీపంలో సైకిల్ షాప్ నిర్వహించే ముఖ్తార్ బాబాకు విక్రయించాడు. దీంతో ఆస్తిని కొన్న ముఖ్తార్ బాబా అక్కడే నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను అక్కడి నుంచి తరలించి ఓ హోటల్‌ను ఏర్పాటు చేశాడు. కాన్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ రికార్డుల ప్రకారం, ఆస్తి ఇప్పటికీ ఆలయంగా జాబితా చేయబడింది. శత్రు సంపతి సంరక్షణ సంఘర్ష్ సమితి గతేడాది ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ జాయింట్ మేజిస్ట్రేట్‌ను విచారణకు కోరారు. అయితే దీనిపై స్పందించిన ముఖ్తార్ బాబా కుమారుడు మహ్మద్ ఉమర్.. తన వద్ద ఆస్తి పత్రాలు ఉన్నాయని.. అధికారుల ప్రశ్నలకు త్వరలోనే సమాధానం ఇస్తానని చెప్పారు.