Farmers Protest: అప్పటివరకు ఉద్యమం ఇలానే కొనసాగుతుంది.. రాకేశ్ తికాయత్ కీలక వ్యాఖ్యలు

Rakesh Tikait: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో..

Farmers Protest: అప్పటివరకు ఉద్యమం ఇలానే కొనసాగుతుంది.. రాకేశ్ తికాయత్ కీలక వ్యాఖ్యలు
Rakesh Tikait
Follow us

|

Updated on: Mar 04, 2021 | 2:35 PM

Rakesh Tikait: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు మూడునెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం మధ్య పలుమార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. జనవరి 26న ఢిల్లీలో జరిగిన అల్లర్ల అనంతరం రైతు సంఘాలు, కేంద్రం మధ్య చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ తరుణంలో భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ తికాయత్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తమ మొరను ఆలకించనంత వరకు ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుందని తికాయత్ స్పష్టంచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంతో మాట్లాడటానికి ఎలాంటి అవకాశాలు లేవని పేర్కొన్నారు. అయితే ఉద్యమానికి సన్నాహాలు మాత్రం చాలా జరుగుతున్నాయంటూ రాకేశ్ తికాయత్ వివరించారు.  ఇదిలాఉంటే.. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం నిర్వహిస్తున్న రైతులకు మద్ధతుగా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. వేసవి కాలం దృష్ట్యా సరిహద్దుల్లో రైతు సంఘాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. సోలార్ ప్యానెళ్లను, జనరేటర్లను ఏర్పాటు చేశారు.

గత మూడు నెలలనుంచి దేశవ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటివరకు 12 సార్లు చర్చలు జరిగాయి. చివరిసారిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా.. సవరణలు మాత్రమే చేస్తామంటూ కేంద్రం పేర్కొంటోంది.

కాగా.. వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర కాలం పాటు నిలుపుదల చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరిస్తేనే మళ్లీ చర్చలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో చర్చలు జరిగేలా కనిపించడం లేదు.

Also Read:

Bank Strike : ఈనెలలో ఆ రెండురోజులూ బ్యాంకులు బంద్, ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె బాట

Crime: యూపీలో మరో ఘోరం.. కుమార్తె తల నరికి.. చేతిలో పట్టుకొని.. గ్రామంలో తిరిగిన తండ్రి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో