AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై వీడియో కంటెంట్, నిఘా ఉండాలన్న సుప్రీంకోర్టు, కేంద్రానికి తాజా ఆదేశాలు

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై రిలీజ్ చేసే వీడియో కంటెంట్లపై నిఘా వంటిది ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పుడు వీటిపై పోర్నోగ్రఫీ సైతం చోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై వీడియో కంటెంట్, నిఘా  ఉండాలన్న సుప్రీంకోర్టు,  కేంద్రానికి తాజా ఆదేశాలు
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 04, 2021 | 2:34 PM

Share

ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై రిలీజ్ చేసే వీడియో కంటెంట్లపై నిఘా వంటిది ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పుడు వీటిపై పోర్నోగ్రఫీ సైతం చోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఓటీటీల్లో మూవీలు, ఇతర కంటెంట్లను పబ్లిక్ చూస్తున్నారని, అందువల్ల కనీసం స్క్రీనింగ్ వంటిది ఉంటే మంచిదని పేర్కొంటూ. సోషల్ మీడియా ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లను రెగ్యులేట్ చేయడానికి కొత్త గైడ్ లైన్స్ ని జారీ చేయాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యాన గల బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇండియాలో అమెజాన్ హెడ్ అపర్ణా పురోహిత్ దాఖలు చేసిన ఓ పిటిషన్ ను కోర్టు విచారించింది. తాండవ్ వెబ్ సిరీస్ పై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు తనకు వ్యతిరేకంగా ఇఛ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అపర్ణ అప్పీలు దాఖలు చేశారు.తనను పోలీసులు అరెస్టు చేయకుండా చూడాలన్న ఆమె అభ్యర్థనను అలహాబాద్ కోర్టు తిరస్కరించింది.  ఆమె యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను తిరస్కరించింది. (అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రసారమైన తాండవ్ సిరీస్ పెను వివాదాన్ని సృష్టించింది. అందులో హిందూ దేవుళ్ళు, దేవతలను కించపరిచే సంభాషణలు, సన్నివేశాలు  ఉన్నాయని,  దీని  మేకర్స్ ను, నటీనటులను అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం, చివరకు మేకర్స్ సహా అంతా క్షమాపణ చెప్పడం తెలిసిందే).

దీంతో అపర్ణ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ సందర్భంగా కోర్టు.. ఈ విధమైన ప్లాట్ ఫామ్ లపై రిలీజయ్యే వీడియోలు, ఇతర చిత్రాలు తదితరాలపై నిఘా వంటిది ఉండాలని అభిప్రాయపడింది. పిల్లలు, యువత కూడా స్వేఛ్చగా ఇంటర్నెట్ లో ఈ విధమైనవాటిని చూస్తున్నారని, అందువల్ల కేంద్రం దీనిపై తగిన మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది.

మరిన్ని చదవండి ఇక్కడ :

Bigg Boss Season 5 : బిగ్ బాస్ సీజన్ 5.. రేసులో ఉన్న కంటెస్టెంట్లు వీరే.. వివరాలు ఇవే..!

Snake Drinking water : దాహంతో ఉన్న పాముకు నీళ్లు తాగించిన వ్వక్తి వైరల్ అవుతున్న వీడియో..!

విజయనగరం యువతి ఫేక్‌స్టోరీ! కాళ్లుచేతులు కట్టేసుకుని..తానే నాటకం ఆడినట్టు అంగీకారం : girl kidnap video

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..