Crime: యూపీలో మరో ఘోరం.. కుమార్తె తల నరికి.. చేతిలో పట్టుకొని.. గ్రామంలో తిరిగిన తండ్రి..
Uttar Pradesh Man Cuts Off Daughter's Head: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక సంఘటనతో అట్టుడుకుపోయే యూపీలో.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ సారి..
Uttar Pradesh Man Cuts Off Daughter’s Head: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక సంఘటనతో అట్టుడుకుపోయే యూపీలో.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ సారి ఓ తండ్రి.. తన కూతురిపై కోపంతో తల నరికాడు. అనంతరం ఆ తలను చేతిలో పట్టుకోని వీధుల్లో తిరిగాడు. ఈ సంఘటన యూపీతోపాటు దేశమంతటా కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలోని పండెతెరా గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. లక్నో నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం పరిధిలోని పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి.. నరికేసిన ఓ తలను చేతిలో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. ఆ తల ఆయన కుమార్తెదేనని గుర్తించి వారు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీస్ అధికారులు సర్వేశ్ నడుస్తున్న ప్రాంతానికి వెళ్లి అతన్ని ఆపారు. ఈ సందర్భంగా పోలీసులు.. వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీశారు. తొలుత నిందితుడి పేరు అడిగి, ఆ తల ఎవరిదని ప్రశ్నించగా, అతను ఏ మాత్రం సంకోచించకుండా అది తన కుమార్తెదని, హత్య చేసింది తాను ఒక్కడినేనని చెప్పాడు.
ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని తెలిపాడు. తల తన దగ్గరఉందని.. మిగతా శరీరభాగం ఇంట్లో ఉందని తెలిపాడు. అనంతరం పోలీసుల సూచన మేరకు తలను కిందపెట్టి.. రోడ్డు పక్కన కూర్చుంటాడు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. తలను అనుచితంగా మోసుకెళ్లిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు పోలీసు అధికారి కపిల్ డియో సింగ్ తెలిపారు.
Also Read: