AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామన్ రావు దంపతుల హత్య కేసుః ముగిసిన నిందితుల పోలీసు కస్టడీ.. ఐదో నిందితుడు లచ్చయ్య అరెస్ట్

మంథని డబుల్ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న బిట్టు శ్రీను, కుంట శ్రీను కస్టడీ ముగిసింది. 7రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక ఆధారాలను రాబట్టినట్లు సమాచారం.

వామన్ రావు దంపతుల హత్య కేసుః ముగిసిన నిందితుల పోలీసు కస్టడీ.. ఐదో నిందితుడు లచ్చయ్య అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Mar 04, 2021 | 8:39 PM

Share

Vamanrao couple Murder case : మంథని డబుల్ మర్డర్ కేసులో నిందితులుగా ఉన్న బిట్టు శ్రీను, కుంట శ్రీను కస్టడీ ముగిసింది. 7రోజుల పాటు విచారించిన పోలీసులు కీలక ఆధారాలను రాబట్టినట్లు సమాచారం. ఇద్దర్నీ వేర్వేరుగా ఆరు రోజుల చొప్పున విచారించిన పోలీసులు.. చివరి రెండు రోజులు ముఖాముఖి విచారణ జరిపించారు. అంతిమంగా గ్రామంలో నెలకొన్న గొడవలు, పదేపదే తమను అవమానిస్తున్నందుకే వామనరావు, నాగమణి దంపతులను హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పకున్నట్లు తెలుస్తోంది.

మొదటి రోజు హత్య ఎందుకు చేశారని ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు పోలీసులు. సుమారు పదిగంటలపాటు ఆ రోజు విచారణ జరిగింది. మర్డర్స్‌లో రాజకీయ ప్రమేయం గురించి పదే పదే ప్రశ్నించినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానాన్ని రాబట్టలేకపోయారు పోలీసులు. ఇక రెండోరోజు… పాత కేసులపైన కూడా పోలీసులు.. ఇద్దర్ని కూపీ లాగారు. డబుల్ మర్డర్స్ విషయంలో ఇద్దరూ వేసిన స్కెచ్, అమలైన తీరు, ఫోన్‌కాల్స్ డేటా వంటి వాటిపై ఆరా తీశారు. హత్యకు ముందురోజు మద్యం తాగుతూనే తర్వాత రోజు మర్డర్ ఎలా చెయ్యాలన్న ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులకు వివరించినట్లు సమాచారం.

ఇక, మూడో రోజు మర్డర్ చేసేందుకు కత్తులు ఎక్కడి నుంతి తెచ్చారు. మర్డర్ తర్వాత వాటిని ఏం చేశారన్నదానిపై ప్రశ్నిచారు. నాలుగో రోజు నిందితులు చెప్పిన సమాచారం ప్రకారం సుందిళ్ల బ్యారేజ్ దగ్గరకు తీసుకెళ్లి కత్తుల కోసం గాలించారు. రెండు రోజులపాటు విశాఖపట్నం నుంచి గజఈతగాళ్లను రప్పించి సెర్చింగ్ చేపట్టారు. ఎట్టకేలకు బ్యారేజ్‌లో కత్తులను బయటకు తీసుకొచ్చారు. ఆరో రోజు.. హత్య జరిగిన ప్రదేశం నుంచి కోర్టు వరకూ వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. హత్యకు రెక్కీ నిర్వహించిన తీరు, వామనరావు కదలికలపై నిఘా గురించి తెలుసుకున్నారు. ఇక, ఏడోరోజు కస్టడీ ముగింపు తర్వాత నిందితులను మంథని కోర్టు ముందుకు తీసుకెళ్లారు. మొత్తంగా, వామనరావు దంపతులు పదేపదే అవమానిస్తున్నారన్న కోపం తోనే నాలుగు నెలల క్రితం మర్డర్స్‌కు స్కెచ్ వేశారన్న వాస్తవాన్ని పోలీసులు తేల్చినట్లుగా కనిపిస్తోంది. అయితే, ఈ కస్టడీ రిపోర్ట్ అధికారికంగా బయటకు రావాల్సి ఉంది.

మరోవైపు, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడిని మంథని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ-5గా ఉన్న లచ్చయ్యను పోలీసులు అదపులోకి తీసుకుని మంథని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. దీంతో లచ్చయ్యకు న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, కుమార్, చిరంజీవి, బిట్టు శ్రీనులతో కలిపి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.