Rajasthan: ఆ రాష్ట్రంలోకి వెళ్లాలంటే కచ్చితంగా కోవిద్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..ఎక్కడంటే..
కరోనా వైరస్ ఉధృతి పెరిగిపోతున్న తరుణంలో రాజస్థాన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
Rajasthan: కరోనా వైరస్ ఉధృతి పెరిగిపోతున్న తరుణంలో రాజస్థాన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రాత్రి వేళ కర్ఫ్యూ విధించిన ఆ రాష్ట్రం మల్టీప్లెక్స్ లు, జిమ్ లు మూసివేయాలని ఆదేశించింది. ఇక మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంది రాజస్థాన్ ప్రభుత్వం.
బయట రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజస్థాన్ ప్రభుత్వ కార్యదర్శి అభయ్ కుమార్ కోవిడ్ మార్గదర్శకాలను విడుదళ చేశారు.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ విధించిన వేళలో రాజస్థాన్ కూడా అదే తరహాలో ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.
రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాలు ఇవే..
- బయట రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారు కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాలి. అది 72 గంటలు మించకుండా ఉండాలి
- 1 నుంచి 10 వ తరగతి వరకూ ఏప్రిల్ 5 నుంచి 19 వ తేదీ వరకు సెలవులు. వైద్య కళాశాలలు మాత్రం కొనసాగుతాయి.
- రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూ ఉంటుంది.
- స్థానిక ప్రజలు కూడా అనవసర ప్రయాణాలు మానుకుంటే మంచిది
- మాస్కులు ధరించడం తప్పనిసరి
- సామాజిక దూరం కచ్చితంగా పాటించాలి
ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజస్థాన్ ప్రభుత్వం హెచ్చరించింది.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లో గత 24 గంటల్లో 1,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు.
Also Read: Mamata Banerjee: ఒంటి కాలుతో బెంగాల్‌ను, రెండు కాళ్లతో ఢిల్లీని గెలుస్తా: మమతా బెనర్జీ
Migrants: లాక్ డౌన్ భయంతో మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు వెళ్లిపోతున్న వలసకార్మికులు