India Corona Virus : దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
India Corona : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 291 మంది మృతి చెందినట్లు
India Corona: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 291 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 1,19,08,910 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా కరోనా నుంచి1,12,95,023 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,61,240 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,52,647 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 5,81,09,773 కు చేరినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, దేశంలో గతంలో కంటే ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వల్ల కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.