AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migrants: లాక్ డౌన్ భయంతో మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు వెళ్లిపోతున్న వలసకార్మికులు

సరిగ్గా సంవత్సరం క్రితం దాదాపుగా ఇదే నెలల్లో దేశం పూర్తిగా స్తంభించిపోయింది. ఒక పక్క కనీ వినీ ఎరుగని వైరస్ గురించిన వార్తలు.. మరోపక్క రెక్కాడితేకానీ డొక్కాడని వలస జీవుల వెతలు ఇవే ముఖ్యమైన కథనాలు

Migrants: లాక్ డౌన్ భయంతో మహారాష్ట్ర నుంచి స్వస్థలాలకు వెళ్లిపోతున్న వలసకార్మికులు
Migrants
Anil kumar poka
| Edited By: Team Veegam|

Updated on: Apr 05, 2021 | 6:51 PM

Share

Migrants: సరిగ్గా సంవత్సరం క్రితం దాదాపుగా ఇదే నెలల్లో దేశం పూర్తిగా స్తంభించిపోయింది. ఒక పక్క కనీ వినీ ఎరుగని వైరస్ గురించిన వార్తలు.. మరోపక్క రెక్కాడితేకానీ డొక్కాడని వలస జీవుల వెతలు ఇవే ముఖ్యమైన కథనాలుగా కనిపిస్తూ ఉండేవి. అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ తో మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. పొట్ట కూటికోసం కేశవంత స్థలాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక, కరోనా మహమ్మారి తో ఏమైపోతామో అనే భయంతో స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. కాలినడకన వందలాది మైళ్ళు పిల్లలను ఎత్తుకుని.. నెత్తిన మూటలతో ఎర్రటి ఎండలో ప్రజలు ప్రయాణాలు సాగించిన దృశ్యాలు ఇంకా అందరి కళ్ళముందు సజీవంగా ఉన్నాయి.

కొన్ని నెలల క్రితం అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించారు. క్రమేపీ మళ్ళీ వలసజీవులు పనులు వెతుక్కుంటూ స్వస్థలాల నుంచి వివిధ ప్రదేశాలకు చేరుకున్నారు. మెల్లగా పూర్వపు స్థితిలో జీవనం మొదలవుతున్న పరిస్థితులకు సంతోషపడ్డారు. అయితే, వారి సంతోషం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. మళ్ళీ మహమ్మారి విజృంభిస్తోంది.

మెల్లగా పరిస్థితులు మారిపోతున్నాయి. కరోనా కేసులు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపంతో మరోసారి విజృంభిస్తోంది. దీంతో మళ్ళీ గతేడాదిలా పరిస్థితులు మారేలా కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కఠిన ఆంక్షలు మళ్ళీ విధించారు. దీంతో మళ్ళీ అలజడి మొదలైంది.

గతేడాది లాక్ డౌన్ సందర్భంగా పడిన కష్టాలు మళ్ళీ వస్తాయేమో అనే భయం వలస కార్మికులకు మొదలయ్యాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాకు చేరుకునేందుకు ప్రయాణాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా నాసిక్ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, బెంగాల్ ప్రాంతాలకు వలస కార్మికులు తరలి వెళ్లిపోతున్నారు.

యూపీకి చెందిన కార్మికుడు ఒకరు మాట్లాడుతూ తన యజమాని తనకు సొంత ఊరు వెళ్లిపొమ్మని చెప్పారని చెప్పడం ఇక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఇప్పటికే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేశారు. దీంతో అక్కడ పనిచేసిన వారందరూ స్వస్ధలాలకు బయలు దేరిపోయారు. నాసిక్ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇప్పుడు చిన్న వ్యాపారుల వద్ద పనిచేసే కార్మికులను ఆదుకునే పరిస్థితులు లేవు. మళ్ళీ లాక్ డౌన్ వస్తుందనే భయం ఉంది. అందుకే కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.

ఏదిఏమైనా కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడప్పుడే పోయేలా కనిపించడం లేదు. భవిష్యత్ లోనూ వలస కార్మికుల పరిస్థితి ఇంతే గందరగోళంగా ఉండేలా ఉంది.

Also Read: Cobra Battalion Jawan Safe: గల్లంతైన కోబ్రా జవాన్‌ మా వద్దే ఉన్నాడు.. క్లారిటీ ఇచ్చిన మావోయిస్టులు..

లూధియానాలో కుప్పకూలిన ఫ్యాక్టరీ భవనం.. ఒకరు మృతి, 10మందికి గాయాలు..