AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Sweet’ Success: లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్లో సంపాదన..

కొంతమంది పరిస్థితులను ఎదురీదలేక.. నిరాశతో కృంగిపోతే.. మరికొందరు ఎటువంటి పరిస్థితులనైనా తమకు అనుగుణంగా మార్చుకుని సరికొత్తగా ఎదుగుతారు. ఇక కరోనా వైరస్ నివారణ కోసం దేశంలో లాక్ డౌన్ విధించారు. అప్పుడు చాలా మంది...

'Sweet’ Success: లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్లో సంపాదన..
Grand Daughter With Grany
Surya Kala
|

Updated on: Apr 05, 2021 | 4:27 PM

Share

‘Sweet’ Success: కొంతమంది పరిస్థితులను ఎదురీదలేక.. నిరాశతో కృంగిపోతే.. మరికొందరు ఎటువంటి పరిస్థితులనైనా తమకు అనుగుణంగా మార్చుకుని సరికొత్తగా ఎదుగుతారు. ఇక కరోనా వైరస్ నివారణ కోసం దేశంలో లాక్ డౌన్ విధించారు. అప్పుడు చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. అయితే మరికొందరు.. తమ ఆలోచనలకు పదును పెట్టి.. ఆర్ధికంగా ఎదగడానికి వ్యాపారాలు మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. అటువంటి కోవలోకే వస్తారు. కోల్ కతా కు చెందిన నాన్నమ్మ మనవరాలు. నానమ్మ చేసిన స్వీట్స్ ను మనవరాలు సక్సెస్ ఫుల్ గా దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ.. లక్షల్లో ఆర్జిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

లాక్ డౌన్ విధించడం తో కోల్‌కతాకు చెందిన యాషీ చౌదరి ఇంటి వద్దనే ఉండిపోయింది. అయితే నాయనమ్మ మంజూ పోద్దార్ తో కలిసి గత ఏడాది ఇంటి నుంచి మిఠాయిల వ్యాపారం ప్రారంభించింది. కేవలం 8 నెలల వ్యవధిలోనే ఇద్దరూ కలిసి నాలుగు లక్షల ఆదాయాన్ని సంపాదించారు. ఇప్పుడు వారి వ్యాపారం విజయవంతంగా సాగుతోంది.

ప్రస్తుతం వారు అమెరికాకు కూడా మిఠాయిలను ఎగుమతి చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రతీ నెలా సుమారు 200కుపైగా ఆర్డర్లను వీరు అందుకుంటున్నారు.

లండన్‌లో మాస్టర్స్ చేసిన యాషీ చౌదరి ‘గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నాయనమ్మ దగ్గరకు వచ్చింది. అయితే నాన్నమ్మ రోజుకో కొత్త రకం పిండి వంటలు చేసి నాకు పెడుతుంటే.. అప్పుడు వ్యాపార ఆలోచన వచ్చినట్లు యాష్ చెప్పింది. ఛాలెంజిగ్‌గా తీసుకుని ఇంటి నుంచే చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించాం. మొదట్లో కొన్ని మిఠాయిలు తయారు చేసి, మాకు తెలిసిన వారికి విక్రయిస్తూ వచ్చాం.

మా వ్యాపారం మెల్లమెల్లగా పెరగసాగింది. దీంతో మేము మిఠాయిల డెలివరీ స్థాయిని కూడా పెంచాం. ముఖ్యంగా పండగల సీజన్‌లో మిఠాయిలకు అత్యధిక డిమాండ్ ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని, మా వ్యాపారాన్ని మరింత విస్తృతం చేశామని చెప్పారు. అయితే ఎవరైనా కొత్తవారు వ్యాపారం చేయాలనీ భావిస్తే.. ముందుగా మార్కెట్ ను అంచనా వేసి మొదలు పెట్టాలని యాష్ సూచించారు.

Also Read: ‘టీకా తీసుకోవడం వల్లనే నేను సేఫ్’.. అంటూ.. వ్యాక్సిన్ పని తీరుపై స్పందించిన అల్లు అరవింద్..

రికాని ఊరిలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం.. లంచ్‌గా అన్నంలో నీరు..ఉల్లిపాయ.. హార్ట్‌టచింగ్‌ స్టోరీ!