AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమల్లోకి..

తత్కాల్ టికెట్ల బుకింగ్స్‌కు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. నేటి నుంచి నూతన నిబంధనలను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీలో లాగిన్ అయి చేసుకునేవారు. కానీ ఇప్పటినుంచి అలా వీలుపడదు. ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని రైల్వేశాఖ చెబుతోంది.

Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమల్లోకి..
Train Tickets
Venkatrao Lella
|

Updated on: Dec 01, 2025 | 8:37 AM

Share

Indian Railways: డిసెంబర్ 1వ తేదీ రావడంతో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్ధిక పరంగా కొన్ని మార్పులు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా రైల్వే తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలను నేటి నుంచి ప్రవేశపెట్టనున్నారు. ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లాలనుకుంటే వెంటనే తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటారు. ఎక్కడికైనా వెంటనే ప్రయాణం చేయాలంటే తత్కాల్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సాధారణ టికెట్లతో పోలిస్తే కాస్త ధర ఎక్కువగా ఉన్నా.. వెంటనే వెళ్లాలి కాబట్టి తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే ఈ టికెట్లపై కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

ఇక నుంచి తత్కాల్ సిస్టమ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి చేస్తున్నారు. ఓటీపీ వెరిఫై అయిన తర్వాతే టికెట్లు బుక్ అవుతాయి. ఒకవేళ ఓటీపీ తప్పుగా ఎంటర్ చేస్తే టికెట్ కన్ఫరేషన్ అవ్వదు. సురక్షితంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే ఈ వ్యవస్థ తీసుకొచ్చింది. కేవలం తత్కాల్ బుకింగ్‌లకు మాత్రమే ఆ నిర్ణయం వర్తిస్తుంది. మిగతా టికెట్లు యథావిధిగా ఐఆర్‌సీటీసీ లాగిన్స్‌తో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ బుకింగ్స్‌కు ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థ తీసుకురావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

కొంతమంది తత్కాల్ బుకింగ్‌లో మోససూరిత పద్దతులు పాటిస్తున్నారు. దీని వల్ల అసలు ప్రయాణికులకు నష్టం చేకూరుతుంది.దీనికి చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఓటీపీ వెరిఫికేషన్ సిస్టమ్ కొత్తగా తీసుకొస్తుంది. వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే ఇక నుంచి టికెట్లు బుక్ చేసుకుంటారని, దీని వల్ల పారదర్శకత ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Follow Us
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
ఎంబీఏ చదివి ఇదేం పనిరా..? ఏకంగా మహిళా పోలీస్‌కే మస్కా కొట్టాడు..
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
యుద్ధం ఉద్రిక్తతల మధ్య భారత రక్షణశాఖ సంచలన నిర్ణయం!
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!