AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనర్హత వేటు అనంతంరం ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన అనంతరం రాహుల్ తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. గతంలో మెంబర్​ ఆఫ్ ​ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్, ఎంపీ అని ఉండగా

అనర్హత వేటు అనంతంరం ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్ గాంధీ
Aravind B
|

Updated on: Mar 26, 2023 | 1:23 PM

Share

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడిన అనంతరం రాహుల్ తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. గతంలో మెంబర్​ ఆఫ్ ​ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్, ఎంపీ అని ఉండగా ఇప్పుడు దానిని మెంబర్ ​ఆఫ్ ​ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్, డిస్​క్వాలిఫైడ్ ​ఎంపీ గా మార్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఇంటిపేరుతో దూషించిన కేసులో మార్చి 23న సూర‌త్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన క్రమంలో ఆయ‌న‌పై అన‌ర్హత వేటు ప‌డింది. అయితే రాహుల్ సుప్రీం కోర్టులో ఈ తీర్పును సవాలు చేస్తూ ఇంకా ఎటువంటి పిటీషన్ దాఖలు చేయలేదు.

మరోవైపు రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఢిల్లీలోని రాజ్ ఘట్ వద్ద సత్యగ్రహ దీక్షను ప్రారంభించింది. పోలీసుల అనుమతి లేనప్పటికీ దీక్షలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఇప్పటికే పోలీసులు తెలిపారు. కాగా రాహుల్​ గాంధీపై అనర్హత వేటుకు సంఘీభావంగా  దేశవ్యాప్తంగా గాంధీ విగ్రహాల ఎదుట నిరసన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?