Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన సూరత్ సెషన్స్ కోర్టు..
పరువునష్టం దావా కేసులో కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ వేశారు రాహుల్‌గాంధీ. తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా సూరత్ కోర్టు చేరుకున్నారు. రాహుల్‌కు సంఘీభావం తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా కోర్టుకు తరలివచ్చాయి.
రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సోమవారం అప్పీలు దాఖలు చేశారు. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరగనుంది. రాహుల్ గాంధీ కూడా సూరత్ కోర్టుకు విచారణకు చేరుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా సూరత్ చేరుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు కూడా గుజరాత్ చేరుకున్నారు.
మార్చి 23న, సూరత్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాలో రెండేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే, కోర్టు అదే రోజు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అతని శిక్ష అమలుపై 30 రోజుల పాటు స్టే విధించింది. తద్వారా అతను పై కోర్టులో అప్పీల్ దాఖలు చేయవచ్చు.
Defamation case | Surat Sessions Court extends Rahul Gandhi’s bail till April 13, the next date of hearing in the case pic.twitter.com/Orvny11Wpl
— ANI (@ANI) April 3, 2023
సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత, లోక్‌సభ సెక్రటేరియట్ మార్చి 24న రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్‌సభకు అనర్హత వేటు పడిన తర్వాత, రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఎందుకు అని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.
#WATCH | Gujarat: Congress leaders from several states arrive at Surat District & Sessions Court. pic.twitter.com/e2QY7ZT2F8
— ANI (@ANI) April 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం