నవజ్యోత్ సిద్దుకు తలనొప్పిగా మారిన సలహాదారులు.. సమన్లు పంపిన మాజీ క్రికెటర్
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఆయన నలుగురు సలహాదారుల్లో ఇద్దరు తలనొప్పిగా మారారు. మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గి అనే ఈ ఇద్దరికీ ఆయన సమన్లు జారీ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఆయన నలుగురు సలహాదారుల్లో ఇద్దరు తలనొప్పిగా మారారు. మల్వీందర్ సింగ్ మాలి, ప్యారేలాల్ గార్గి అనే ఈ ఇద్దరికీ ఆయన సమన్లు జారీ చేశారు. పాటియాలాలోని తన నివాసానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరారు. అసలే ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో తనకు అంతంత మాత్రంగా ఉన్న సఖ్యత వీరివల్ల మరింత దిగజారుతుందని భావిస్తున్న సిద్దు.. డ్యామేజీ కంట్రోల్ లో పడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ గెలుపునకు వీరు తనకు సలహాలిస్తారని అనుకుంటే తమ వివాదాస్పద వ్యాఖ్యలతో మొదటికే మోసం తెచ్చేట్టు ఉన్నారని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాశ్మీర్ ని భారత-పాకిస్తాన్ దేశాలు అక్రమంగా ఆక్రమించుకున్నాయని, నిజానికది ప్రత్యేక దేశమని..ముఖ్యంగా ఇండియా దాన్ని గుర్తించాలని మల్వీందర్ సింగ్ ఇటీవల తన ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. పైగా దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్కెచ్ నొకదానిని అయన గత జూన్ లోనే పోస్ట్ చేసి మరో వివాదం రేపారు. అది 1989 నాటి పంజాబ్ మ్యాగజైన్ ముఖచిత్రంగా ప్రచురింప బడింది. అంతేకాదు.. హిందువులు, సిక్కులను రక్షించే బాధ్యత తాలిబన్లదేనని, వారి పాలనలో ఆఫ్ఘనిస్థాన్ బాగానే ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నాడు.
ఇక పాకిస్థాన్ పట్ల సీఎం అమరేందర్ సింగ్ తన అభిప్రాయాలను మార్చుకోవాలంటూ ప్యారేలాల్ గార్గి చేసిన వ్యాఖ్య కూడా సింగ్ కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. వీరిద్దరినీ సిద్దు కంట్రోల్ చేయాలనీ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. వీరు దేశ ప్రయోజనాలకు హాని కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆయన సిదుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన సలహాదారుల వైఖరితో ఇరకాటంలో పడిన సిద్దు..వారికి సమన్లు జారీ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Vodafone Idea: అప్పుల్లో కూరుకుపోతున్న వొడాఫోన్ ఐడియా.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం అవుతుందా..?
‘మీ తండ్రి లాలూజీ ఎలా ఉన్నారు’ ? కుల గణన మీటింగ్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో ప్రధాని మోదీ