దేశంలో కులాల వారీ గణన జరగాల్సిందే.. తప్పదు.. బీహార్ సీఎం నితీష్ కుమార్

దేశంలో కులాలవారీ గణన (లెక్కింపు) జరగాల్సిందేనని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఇలాంటి ప్రక్రియ కనీసం ఒక్కసారైనా జరగాలని దేశవ్యాప్తంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.

దేశంలో కులాల వారీ గణన జరగాల్సిందే.. తప్పదు.. బీహార్ సీఎం నితీష్ కుమార్
Bihar Cm Nitish Kumar
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 23, 2021 | 6:22 PM

దేశంలో కులాలవారీ గణన (లెక్కింపు) జరగాల్సిందేనని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఇలాంటి ప్రక్రియ కనీసం ఒక్కసారైనా జరగాలని దేశవ్యాప్తంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు. ఇది అన్ని సామాజికవర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. నితీష్ కుమార్ ఆధ్వర్యాన అఖిల పక్ష బృందమొకటి సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి దీనిపై చర్చించింది. ఆయన తమ సంభ్యులందరి అభిప్రాయాలు విన్నారని నితీష్ ఆ తరువాత తెలిపారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తాము కోరామన్నారు. కాస్ట్ సెన్సస్ పై తమ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చినట్టు ఆయన తెలిపారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. కేవలం బీహార్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియ జరగాల్సి ఉందని, జంతువులు, చెట్ల గణన జరుగుతున్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు నిర్వహించరాదని పేర్కొన్నారు. కుల గణన అన్నది చరిత్రాత్మకం..పేదలకు అనుకూల చర్య అవుతుందని ఆయన చెప్పారు.

కేవలం ఎస్సీలు, ఎస్టీల జనాభా సేకరణ మాత్రమే జరగాలని గతనెలలో పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటనతో.. కుల ప్రాతిపదికపై సెన్సస్ జరగాలన్న డిమాండ్ ఊపందుకుంది. బీహార్ లో ఇతర వెనుకబడిన కులాల వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఫలితంగా ఈ డిమాండ్ మరింత హెచ్చింది. ఇతర కులాల వారి లెక్కల సేకరణ కూడా జరగాలని అన్ని పార్టీలు కోరనారంభించాయి. ఈ రాష్ట్రంలో పాలక జేడీయూ, విపక్ష ఆర్జేడీ కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాను దీనిపై ప్రధానికి లోగడే లేఖ రాసినట్టు తేజస్వి యాదవ్ తెలిపారు. 2019 లోను ఆ తరువాత 2020 లో కూడా రాష్ట్ర శాసన సభ రెండు సార్లు తీర్మానాలను ఆమోదించిన అంశాన్ని కూడా ఈ లేఖలో తెలిపానన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నవజ్యోత్ సిద్దుకు తలనొప్పిగా మారిన సలహాదారులు.. సమన్లు పంపిన మాజీ క్రికెటర్

Vodafone Idea: అప్పుల్లో కూరుకుపోతున్న వొడాఫోన్‌ ఐడియా.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం అవుతుందా..?