Puducherry: యానాం ఎమ్మెల్యే పదవికి మల్లాడి కృష్ణారావు రాజీనామా.. ప్రమాదంలో నారాయణస్వామి ప్రభుత్వం

Yanam MLA Malladi Krishna Rao: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతనెలలో మంత్రి పదవికి రాజీనామా చేసిన కృష్ణారావు..

Puducherry: యానాం ఎమ్మెల్యే పదవికి మల్లాడి కృష్ణారావు రాజీనామా.. ప్రమాదంలో నారాయణస్వామి ప్రభుత్వం
Follow us

|

Updated on: Feb 15, 2021 | 10:05 PM

Yanam MLA Malladi Krishna Rao: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతనెలలో మంత్రి పదవికి రాజీనామా చేసిన కృష్ణారావు తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ప్రభుత్వం ప్రమాదంలో కురుకుపోయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా పుదుచ్చేరిలో అనేక పదవులను సైతం చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 7వ తేదీన కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించకపోవడంతో తాజాగా ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు సోమవారం వెల్లడించారు.

ఇకపై ఏ ఎన్నికలలో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత నెలలో కృష్ణారావు ప్రకటించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని.. ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తానని కృష్ణారావు తెలిపారు. తాజాగా ఆయన నిర్ణయంతో వీ. నారయణస్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది.

Also Read:

PM Modi: ‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..

మందుబాబులు తస్మాత్ జాగ్రత్త.. అతిగా మద్యం సేవిస్తే డీఎన్ఏలో మార్పులు.. బెంగళూరు సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి!