PM Modi Birthday: 20 రోజులపాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఈ సారి అంత ప్రత్యేకం ఎందుకో తెలుసా..?

Narendra Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారంతో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ 20 రోజులపాటు వేడుకలను నిర్వహించనుంది. నరేంద్ర మోదీ

PM Modi Birthday: 20 రోజులపాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఈ సారి అంత ప్రత్యేకం ఎందుకో తెలుసా..?
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 17, 2021 | 3:19 AM

Narendra Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారంతో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ 20 రోజులపాటు వేడుకలను నిర్వహించనుంది. నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. ఆయన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా దివస్‌గా వారంపాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఈ సారి 20 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి.. ప్రధానమంత్రిగా మోదీ 20 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని 20 రోజులపాటు ఈ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 2014వరకు కొనసాగారు. అనంతరం 2014 నుంచి రెండోసారి ప్రధానమంత్రిగా మోదీ సేవలందిస్తున్నారు. అయితే.. మోదీ సరిగ్గా 2001 అక్టోబర్‌ 7న ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. ఈ వేడుకలు కూడా అక్టోబర్ 7వ తేదీతో ముగియనున్నాయి. మోదీ 20 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో భాగంగా.. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు 20 రోజులపాటు వేడుకలు నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ పిలుపునిచ్చింది.

ఈ మేరకు సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ పేరుతో బీజేపీ ఈ సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, నదీలను శుభ్రం చేసే కార్యక్రమాలు, రేషన్ కార్డుల పంపిణీతో పాటు కరోనా వ్యాక్సినేషన్ లాంటి కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ వేడుకలు అక్టోబర్ 7వ తేదీతో ముగియనున్నాయి. ప్రధాని మోదీ చిత్రంతో ముద్రించిన 14 కోట్ల రేషన్‌ బ్యాగులను కూడా పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71 వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ భారీ వ్యాక్సినేషన్‌కు రూపకల్పన చేసింది.”సేవా సమర్పణ్‌” ప్రచారంలో భాగంగా పుట్టినరోజు నాడు కోవిడ్ -19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సులభతరం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విట్‌ చేశారు. ప్రధాని మోడీకి తన పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలందరూ.. వ్యాక్సినేషన్‌ ను సులభతరం చేయాలని.. ఇదే ఆయనకు ఇచ్చే బహుమతి అని పేర్కొన్నారు. టీకాలు వేయించుకోని వారందరూ.. టీకాలు వేయించుకోవాలని.. సమాజంలోని అన్ని వర్గాల వారు టీకాలు వేయించుకునేలా చూడాలని సూచించారు. వ్యాక్సిన్‌ సేవ ద్వారా ప్రధానికి కానుకిద్దాం అని ఆయన పేర్కొన్నారు.

Also Read:

PM Narendra Modi Birthday: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం.. 71 వేల దీపాలతో శుభాకాంక్షల వెల్లువ.. అర్ధరాత్రి నుంచే..

Narendra Modi birthday: మోడీ పుట్టినరోజున బీజేపీ-కాంగ్రెస్ పోటా పోటీ కార్యక్రమాలు.. సేవా సమర్పన్ అభియాన్ వ్యతిరేకంగా ‘నిరుద్యోగ్ దివాస్’