PM Modi: హిమాచల్ ప్రదేశ్‌కు ప్రధాని మోదీ దీపావళి కానుకలు.. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు నేడు శ్రీకారం..

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, చంబాలను ప్రధాని సందర్శించనున్నారు. అక్కడివారికి దీపావళి బహుమతిగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

PM Modi: హిమాచల్ ప్రదేశ్‌కు ప్రధాని మోదీ దీపావళి కానుకలు.. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు నేడు శ్రీకారం..
Pm Modi In Himachal Pradesh
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 13, 2022 | 9:30 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఉనా హిమాచల్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు ప్రధాన మంత్రి. దీని తరువాత, ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఐఐఐటీ ఉనాను జాతికి అంకితం చేస్తారు. ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. తదనంతరం, చంబాలో జరిగే ఒక బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)-IIIని ప్రారంభిస్తారు. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్‌ ప్రజలపై వరాల జల్లు కురిపించనున్నారు.

ఉనాకు ప్రధాని వరాల జల్లు..

  • ఫార్మాస్యూటికల్ రంగంలో స్వావలంబన తీసుకురావడానికి.. ఉనా జిల్లాలోని హరోలిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 1900 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో పార్క్ ఏపీఐ సహాయం చేస్తుంది. ఇది దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని.. 20,000 మందికి పైగా ఉపాధిని కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను కూడా పెంచనుంది.
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఉనాను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీనికి 2017లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టిట్యూట్‌లో 530 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.
  • కొత్తగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశంలో అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు నడుస్తున్న నాల్గవ వందే భారత్ రైలు ఇది. మునుపటితో పోలిస్తే ఇది మెరుగైన వెర్షన్. ఇది చాలా తేలికైనది.. తక్కువ వ్యవధిలో అధిక వేగాన్ని చేరుకోగలదు. ఇది కేవలం 52 సెకన్లలో 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.

చంబా ప్రజలకు ప్రధాని మోదీ స్పెషల్ గిఫ్ట్..

  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. 48 మెగావాట్ల చంజు-III జలవిద్యుత్ ప్రాజెక్ట్‌తోపాటు.. 30 మెగావాట్ల డియోతల్ చంజు జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఏటా 270 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాజెక్టుల నుంచి దాదాపు రూ. 110 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందగలదని అంచనాలు ఉన్నాయి.
  • రాష్ట్రంలో దాదాపు 3,125 కి.మీ రోడ్లను అప్‌గ్రేడ్ చేయడానికి హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)-IIIని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 15 సరిహద్దులు, మారుమూల బ్లాకుల్లో 440 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.420 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది.

PM పూర్తి షెడ్యూల్..

  • పీఎం హెలికాప్టర్ ఉదయం 9 గంటలకు ఉనా పోలీస్ లైన్ ఝలెదా వద్ద ల్యాండ్ అవుతుంది.
  • వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉనా రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9:15 గంటలకు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు ప్రధాని మోదీ.
  • ఉదయం 9:45 గంటలకు ఉనాలోని ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రధాని మోదీ ముందుగా బల్క్ డ్రగ్ పార్క్, హరోలి, ఉనా-హమీర్‌పూర్ కొత్త రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేస్తారు.
  • ఉదయం 10:50 గంటలకు ఝలేదా నుంచి చంబాకు బయలుదేరుతారు.
  • ఉదయం 11:45 గంటలకు చంబాలోని సుల్తాన్‌పూర్ హెలిప్యాడ్‌ నుంచి చౌగన్‌ మైదాన్‌కు చేరుకుంటారు.
  • మధ్యాహ్నం 12 గంటలకు చౌగన్‌లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.
  • మధ్యాహ్నం 1:05 గంటలకు చంబా బయలుదేరుతుంది. ఆయన పఠాన్‌కోట్ మీదుగా ఢిల్లీకి రానున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?