AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: వైద్యులకు ప్రత్యేక వీసా పథకం తీసుకురావాలి..10 దేశాల వర్క్‌ షాప్‌లో ప్రధాని మోదీ

PM Narendra Modi: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పొరుగు దేశాలన్నీ పరస్పర సహకార స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోదీ...

PM Narendra Modi: వైద్యులకు ప్రత్యేక వీసా పథకం తీసుకురావాలి..10 దేశాల వర్క్‌ షాప్‌లో ప్రధాని మోదీ
Subhash Goud
|

Updated on: Feb 18, 2021 | 8:36 PM

Share

PM Narendra Modi: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కట్టడి కోసం వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పొరుగు దేశాలన్నీ పరస్పర సహకార స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆయా దేశాధినేతలను కోరారు. గురువారం ఆయన కోవిడ్‌-19 మేనేజ్‌మెంట్‌పై పది దేశాలకు చెందిన వైద్య అధికారులు, నిపుణులతో జరిగిన వర్క్‌షాప్‌లో వర్చువల్‌ పద్దతితో ప్రసంగించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు త్వరగా ప్రయాణించేందుకు వీలుగా వైద్యులు, నర్సులకు ఓ ప్రత్యేక వీసా పథకాన్ని ప్రధాని సూచించారు. ఈ పథకాన్ని తీసుకొస్తే అత్యవసర సమయాల్లో ఆయా దేశాల మధ్య వారు త్వరగా ప్రయాణం చేసే వీలు కలుగుతుందని అన్నారు. అలాగే పొరుగు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు వైద్య పరమైన ఆకస్మిక పరిస్థితుల్లో ఉపయోగపడేలా ప్రాంతీయ ఎయిర్‌ అంబులెన్స్‌ ఒప్పందాన్ని సమన్వయం చేయవచ్చని మోదీ అన్నారు.

మరోవైపు ప్రపంచ దేశాలకు ఇప్పటి వరకు 229.7 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ పంపిణీ చేసినట్లు కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. వీటిలో 64.7 లక్షల డోసులు గ్రాంటుగా ఇవ్వగా, 165లక్షల డోసులు కమర్షియల్‌గా పంపిణీ చేసినట్లు పేర్కొంది.

Also Read: Urmila matondkar: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బాలీవుడ్‌ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ సెటైర్లు