Amravati Lockdown: అమరావతిలో మళ్లీ లాక్‌డౌన్‌.. తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు

Amravati Lockdown: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక తాజాగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ..

Amravati Lockdown: అమరావతిలో మళ్లీ లాక్‌డౌన్‌.. తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న కరోనా కేసులు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 18, 2021 | 9:21 PM

Amravati Lockdown: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక తాజాగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. పాజటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారని వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్దవ్ థాక్రే పరోక్షంగా హెచ్చరికలు వాస్తవం అయ్యాయి. రాష్ట్రంలోని అమరావతి జిల్లా వ్యాప్తంగా ఈ శనివారం నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

దేశంలో కోవిడ్‌ ప్రభావం అత్యల్ప స్థాయికి పడిపోయిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ముంబై మేయర్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ముంబై లోకల్‌ రైళ్లలో ప్రయాణిస్తున్న వారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ఇలా అయితే మళ్లీ లాక్‌డౌన్‌ విధించక తప్పదని అన్నారు.

ఇక తాజాగా అమరావతి జిల్లాలో రెండు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించనున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని అమరావతి జిల్లా కలెక్టర్‌ శేలేష్‌ నవల్‌ ప్రకటించారు. గతంలో విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ వర్తించిన నిబంధనలే ప్రస్తుతం విధించే లాక్‌డౌన్‌కు విర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

అలాగే ముంబైలో కూడా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే పలు ప్రాంతాల్లో కూడా లాక్‌డౌన్‌ విధించకతప్పదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: COVID-19 Testing: ఆ దేశాల నుంచి వస్తే కరోనా పరీక్షుల తప్పనిసరి: స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..