PM Modi on Budget 2022: బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలుః మోడీ
ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 100 ఏళ్ల తీవ్ర విపత్తు మధ్య ఈ బడ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.
PM Modi on Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. 100 ఏళ్ల తీవ్ర విపత్తు మధ్య ఈ బడ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో ఈ బడ్జెట్ నిండుగా ఉందన్నారు. ఇది గ్రీన్ ఉద్యోగాల రంగం కూడా తెరవడం జరుగుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు పర్వతమాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రణాళిక పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థను సృష్టిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ బడ్జెట్ మరిన్ని మౌలిక సదుపాయాలు, ఎక్కువ పెట్టుబడులు, మరింత వృద్ధి, మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో నిండి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది గ్రీన్ జాబ్స్‌కు కూడా తెరతీస్తుంది. గత కొన్ని గంటలుగా చూస్తున్నాను, ఈ బడ్జెట్‌కు ప్రతి రంగంలోనూ ఆదరణ లభిస్తున్న తీరు, సామాన్యుల నుంచి వస్తున్న సానుకూల స్పందన ప్రజలకు సేవ చేయాలనే ఉత్సాహాన్ని పెంచిందని ప్రధాని తెలిపారు.
Speaking on #AatmanirbharBharatKaBudget 2022. https://t.co/vqr6tNskoD
— Narendra Modi (@narendramodi) February 1, 2022
భారత ప్రజల విశ్వాసం, గంగామాత ప్రక్షాళనతో పాటు రైతుల సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన చర్య తీసుకోవడం జరిగందన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల్లో గంగా తీరం వెంబడి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్, స్వావలంబన భారతదేశం అనే అంశంపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించింది. రేపు 11 గంటలకు బడ్జెట్‌పై ఈ అంశంపై వివరంగా మాట్లాడతానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.