Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఆర్‌బీఐ కొత్త పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం.. హామీతో కూడిన రాబడి ఉంటుందన్న ప్రధాని మోడీ..

ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు కొత్త స్కీమ్స్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. రిటైల్ డైరెక్ట్ స్కీమ్​, ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​మన్ స్కీమ్​ను వర్చువల్​గా ప్రారంభించారు.

PM Modi: ఆర్‌బీఐ  కొత్త పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితం.. హామీతో కూడిన రాబడి ఉంటుందన్న ప్రధాని మోడీ..
Pm Modi Launches Two New Rb
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 12, 2021 | 1:38 PM

ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు కొత్త స్కీమ్స్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. రిటైల్ డైరెక్ట్ స్కీమ్​, ఇంటిగ్రేటెడ్​ అంబుడ్స్​మన్ స్కీమ్​ను వర్చువల్​గా ప్రారంభించారు.  ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ..ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్కీమ్స్‌ను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకింగ్​ వ్యవస్థ అవసరమన్నారు ప్రధాని మోదీ. ఈ రెండు పథకాలతో దేశంలో పెట్టుబడుల పరిధి మరింత విస్తరిస్తుందన్నారు. ఆర్​బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌తో దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టొచ్చన్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకంతో బ్యాకింగ్ రంగంలో ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్ వ్యవస్థ’ రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు.

కరోనా కారణంగా కుదేలైపోయిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడమే ప్రధాన లక్ష్యంగా గవర్నర్‌ శక్తికాంతా దాస్‌ ఈ స్కీమ్స్‌ను తీసుకొచ్చారు. అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాలు రిటైల్‌ పెట్టుబడులను పరోక్షంగా అనుమతిస్తున్నాయి. తాజా స్కీంతో భారత్‌ కూడా ఈ జాబితాలోకి చేరింది. దీనిద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి రిటైల్‌ ఇన్వెస్ట్‌మెంట్లను అనుమతించిన తొలి ఆసియా దేశంగా గుర్తింపు పొందింది.ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీలలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో ఉచితంగా తీసుకోవచ్చు.

ఖాతాదారుడికి ఫిర్యాదుల పరిష్కారానికి సులభమైన మార్గం లభించిందని మోడీ చెప్పారు. ముందుగా లక్నోలో ఎవరి ఖాతాలోనైనా సమస్య ఉంటే బయట ఫిర్యాదు చేయాల్సి వచ్చేదని ఆయన అన్నారు. కానీ,  ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.

ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..

మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video