AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కేవలం కొబ్బరినీళ్లు, నేలపై నిద్ర.. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని మోదీ కఠిన దీక్ష

ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యద్భుత నిర్మాణ శైలితో..అయోధ్య రామమందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి..రామభక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్దమవుతున్నారు.

PM Modi: కేవలం కొబ్బరినీళ్లు, నేలపై నిద్ర.. రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని మోదీ కఠిన దీక్ష
Pm Modi Fast Ritual For Ayodhya
Balaraju Goud
|

Updated on: Jan 18, 2024 | 8:42 PM

Share

ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యద్భుత నిర్మాణ శైలితో..అయోధ్య రామమందిరం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి..రామభక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్దమవుతున్నారు.

జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కర్మకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియమ నిష్టలతో దీక్ష చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్టకు ఆతిథ్యం ఇవ్వడానికి అవసరమైన నియమాలపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ, నేలపై దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నారు. ప్రధాని పాటిస్తున్న నియమా ఆచారాల ఎనిమిదో రోజు కూడా ప్రధానమంత్రి ఆహారం తీసుకోలేదు.

ఈ కఠినమైన నియమ నిబంధనలను అనుసరించడంతో పాటు, ప్రధానమంత్రి తన అధికారిక పనిని చేస్తున్నారు. ప్రధాని మోదీ గత వారం రోజుల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా పర్యటించారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు 11 రోజుల పాటు ప్రత్యేక పూజ‌లు చేస్తున్నారు. ఇందుకు నియమ దీక్ష పాటిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక పోస్ట్‌ చేశారు “రోజు ప్రత్యేక ఆచారాన్ని ప్రారంభిస్తున్నాను” అని వెల్లడించారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే..!

ఇప్పటికే అయోధ్యపురిలోకి బాలరాముడి విగ్రహాం వచ్చేసింది. భారీ భద్రతా మధ్య ఈ విగ్రహాన్ని ఓ వాహనంలో తీసుకొచ్చారు. ఎలాంటి ఆర్భాటం, హడావుడి లేకుండా ఈ వాహనం అయోధ్య వీధుల గుండా ఆలయం లోపలికి తీసుకెళ్లారు. రామ్‌లల్లా విగ్రహానికి జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు.

ఈ నేపథ్యంలోనే అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. రామ్‌ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ‍ప్రతిధ్వనిస్తుండంతో రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.

అయోధ్యకు దేశ విదేశాల నుంచి భక్తులు, సాధుసంతులు చేరుకుంటున్నారు. వారిలో కొందరు కాలినడకన, మరికొందరు సైకిల్ యాత్ర ద్వారా, ఇంకొందరు బైక్ మీద సాహసోపేతంగా యాత్రలు చేసి చేరుకుంటున్నారు. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా స్థానికేతరులపై ఆంక్షలున్నా సరే.. దివ్య ముహూర్త సమయాన తాము అయోధ్య నగరిలోనే ఉంటామంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us