AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డ మరణం తట్టుకోలేక తల్లడిల్లిన తల్లి.. చివరకు ఆమె ఏం చేసిందో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. 11నెలల తన కుమారుడు ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో మునిగి మృతి చెందడంతో ఆ బాధను తట్టుకోలేకపోయిన తల్లి తాను కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. తన కొడుకు ఉన్న చోటకే తాను వెళ్తున్నట్టు సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

బిడ్డ మరణం తట్టుకోలేక తల్లడిల్లిన తల్లి.. చివరకు ఆమె ఏం చేసిందో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు..
Bengaluru Tragedy
Anand T
|

Updated on: Apr 03, 2026 | 1:57 PM

Share

తన 11 నెలల కుమారుడు ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో మునిగి మరణించడంతో తల్లి కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన 29 ఏళ్ల ప్రతిభ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి భర్తతో కలిసి స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. ఈ దంపతులకు ప్రస్తుతం 11 నెలల కుమారుడు కూడ ఉన్నాడు. అయితే బుధవారం భర్త మహంతేష్‌ ఆఫీస్‌కు వెళ్లడంతో ప్రతిభ తన 11 నెలల కుమారుడు అగస్త్యతో కలిసి ఆడుకుంటుంది.

అయితే బాబును కిందే ఉంచి ప్రతిభ మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కడే ఉన్న 11 నెలల అగస్త్య పాకుకుంటూ వాషింగ్ ఏరియాలోకి వెళ్లి, అక్కడ ఉన్న నీటి బకెట్‌లో పడిపోయాడు. బయటకు వచ్చేందుకు వీళు కాకపోవడంతో ఆ బకెట్‌ నీటిలోనే ఊపిరాడక చిన్నారి మరణించాడు. ప్రతిభ మేడ మీద నుండి కిందకు వచ్చేసరికి బకెట్‌లో పడి ఉన్న తన బిడ్డను చూసి షాక్‌కు గురైంది. వెంటనే బాబును బయటకు తీసి చూడగా అగ్యస్త చనిపోయినట్టు గమనించింది.

కళ్లముందే బిడ్డ ప్రాణాలు పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రతిభ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను కూడా తన కుమారుడి దగ్గరికి వెళ్లిపోవాలని.. కిచెన్‌లోకి వెళ్లి కత్తితో చేతి మణికట్టు కోసుకుని, ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి వచ్చిన భర్త ఇంటి డోర్ లోపల తలుపు వేసి ఉండడం చూసి. తన దగ్గర ఉన్న స్పేర్ కీతో తలుపు తీసి లోపలికి వెళ్లాడు. ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న భార్య, కొడుకును చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు.

ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనతరం క్రైమ్ ఏరియాన్ మొత్తం సెర్చ్ చేయగా ఒక సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ఆ నోట్‌లో ప్రతిభ ఇలా రాసుకొచ్చారు.. తన బిడ్డ మరణానికి తానే బాధ్యురాలినని.. తాను బట్టల కోసం మేడ మీదకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ఆమె పేర్కొన్నారు. తన ప్రాణానికి ప్రాణమైన బిడ్డను కాపాడుకోలేకపోయాననే మనస్తాపంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
బండ బూతులు తిట్టుకున్న ఒకే టీం ప్లేయర్స్.. PSLలో షాకింగ్ సీన్?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ..
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
సమ్మర్‌లో మామిడి పండ్లు లాగిస్తున్నారా?.. జాగ్రత్త వీరికి విషమే
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో అప్డేట్
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
ఈ గింజలు గ్లాసుడు నీళ్లలో ఓ స్పూన్ నానబెట్టి తాగితే ఉంటుంది సామీ!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
వాస్తు టిప్స్ : మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పే సంకేతాలు ఇవే!
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
నలుపు, తెలుపు, గోధుమ.. ఏ రంగు జుట్టు ఉన్నవారు అదృష్టవంతులో తెలుసా
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
భోజనం తర్వాత స్వీట్లు తినాలని ఎందుకు అనిపిస్తుంది?
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
'రామాయణం' టీజర్‌లో ఈ మిస్టేక్స్‌ను గమనించారా? వీడియో
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!
వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..!