AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత కోపం ఏందిరా సామి.. భార్య ముక్కు ఊడిపోయి వచ్చేలా కొరికిన భర్త..!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. హమీర్‌పూర్ జిల్లాలో గృహ హింసకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య పట్ల అత్యంతం క్రూరత్వంగా ప్రవర్తించాడు. తన భార్యను దారుణంగా కొట్టడమే కాకుండా, ఆవేశంలో ఆమె చెంపలను, ముక్కును పళ్లతో కొరికాడు. ఆ గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ఆ మహిళ ముక్కు మాంసం ఊడిపోయింది.

ఇంత కోపం ఏందిరా సామి.. భార్య ముక్కు ఊడిపోయి వచ్చేలా కొరికిన భర్త..!
Husband Bit Wife Nose
Balaraju Goud
|

Updated on: Apr 03, 2026 | 11:40 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. హమీర్‌పూర్ జిల్లాలో గృహ హింసకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య పట్ల అత్యంతం క్రూరత్వంగా ప్రవర్తించాడు. తన భార్యను దారుణంగా కొట్టడమే కాకుండా, ఆవేశంలో ఆమె చెంపలను, ముక్కును పళ్లతో కొరికాడు. ఆ గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ఆ మహిళ ముక్కు మాంసం ఊడిపోయింది. ఈ సంఘటన చికాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్‌హాట్ గ్రామంలో జరిగింది.

పానా అనే యువతికి రథ్ కోత్వాలి ప్రాంతంలోని తోలా గ్రామానికి చెందిన ఫూల్ ఖాన్‌తో వివాహం జరిగింది. పెళ్ళి జరిగినప్పటి నుండి వారిద్దరూ తరచుగా గొడవ పడుతున్నారు. ఇద్దరు మధ్య పలుమార్లు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తన సోదరిపై దాడి చేసి ముక్కు కొరికేసినట్లు ఆమె సోదరుడు అమ్రుద్దీన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బుధవారం (ఏప్రిల్ 01) రాత్రి, ఏదో ఒక విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ వాదన త్వరగా ముదిరి, ఫూల్ ఖాన్ సహనం కోల్పోయాడు. అతను మొదట పానాను దాదాపు చనిపోయేంత వరకు తీవ్రంగా కొట్టాడని ఆమె సోదరుడు అమ్రుద్దీన్ ఆరోపించాడు. ఆమె అలసిపోయినప్పుడు, ఫూల్ ఖాన్ ఆమె ముఖంపై దారుణంగా దాడి చేశాడు. అతను పానా ముక్కు, చెంపలను తన పళ్లతో బలంగా కొరికాడు. దీంతో ముఖంపై మాంసం ఊడిపోయి వచ్చింది. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో, పానాను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటాన్ని చూసి, వైద్యులు ప్రథమ చికిత్స చేసి, ఆ తర్వాత ఝాన్సీ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. పానా చెంపపై 10 సార్లు కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. ఆమె ముక్కుపై ఉన్న తీవ్రమైన గాయం కారణంగా, ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందని వైద్యులు వెల్లడించారు.

అమ్రుద్దీన్ ఫిర్యాదు ఆధారంగా, చికాసి పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన భర్త ఫూల్ ఖాన్, అతని తండ్రి హబీబ్‌లపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు నిర్వహిస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us