AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiramma Houses: అపార్ట్‌మెంట్లలో ఉచితంగా ప్లాట్లు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఎల్-2 జాబితాలో ఉన్న లబ్దిదారుల విషయమై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్‌లో రెండో విడత జాబితా విడుదల చేయనుంది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే ఆలోచనకు వచ్చింది.

Indiramma Houses: అపార్ట్‌మెంట్లలో ఉచితంగా ప్లాట్లు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త
Telangana Indiramma Indlu Scheme
Venkatrao Lella
|

Updated on: Apr 03, 2026 | 2:31 PM

Share

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థలం లేని పేదలకు ఉచితంగా భూమి కేటాయించి ఇంటి నిర్మాణానికి అర్ధిక సాయం చేయాలని గతంలో నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు పథకం అమల్లో కీలక మార్పులు చేసింది. స్థలం కేటాయించి ఇల్లు నిర్మించడం కంటే.. అపార్ట్‌మెంట్లు ఒకచోట నిర్మించి అందులో ఫ్లాట్లు కేటాయించాలని భావించింది. ఇందుకోసం ఒకచోట భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించనున్నారు. అందులో పేదలకు ఫ్లాట్లు కేటాయించనున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఇందుకు అనువైన స్థలాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. స్థల సేకరణ పూర్తయిన తర్వాత అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కసరత్తులు చేస్తోంది.

అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు

జీ+3, జీ+5, జీ+9 అపార్ట్‌మెంట్లను నిర్మించనున్నారు. జీ+3 అపార్ట్‌మెంట్లలో 120 నుంచి 150 ఫ్లాట్‌లు ఉంటాయి. ఇక స్టిల్ట్+5 అపార్ట్‌మెంట్లలో 150 నుంచి 200 ఫ్లాట్లు, స్టిల్ట్+9 అపార్ట్‌మెంట్లలో 200 నుంచి 220 ఫ్లాట్లు ఉంటాయి. డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఇవి 415 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఇక హైదరాబాద్ పరిధిలో 5 మురికివాడలు, మరో 12 కాలనీలను అధికారులు గుర్తించారు. ఇక మేడ్చల్ జిల్లాలో 28 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు, సంగారెడ్డి జిల్లాలో ఇక్రిశాట్ వద్ద 5 ఎకరాలతో పాటు మార్క్స్ నగర్‌లో 6 ఎకరాలు గుర్తించారు. ఇక లక్డారంలో 130 ఎకరాలను అధికారులు సేకరించారు.

జిల్లా కేంద్రాల్లో కూడా స్థలాల సేకరణ

ఇక అపార్ట్‌మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, వాణిజ్య సముదాయాల కోసం షాపులు ఉంటాయి. ఇక జీ+3 అపార్ట్‌మెంట్లకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇళ్లు ఉంటాయి. స్థలం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలను ఎల్-2 జాబితాలో ప్రభుత్వం చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నవారిలో 2.14 లక్షల మంది ఎల్-2 జాబితాలో అర్హత సాధించినట్లు అధాకారులు గుర్తించారు. ఇక వీరికి ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు జిల్లా కేంద్రాల్లో కూడా భూమిని సేకరిస్తున్నారు. కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఏప్రిల్‌లో కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్దమవుతోంది. త్వరలోనే రెండో జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో విడుదల చేసిన  వాటిల్లో 1.5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తయ్యాయి. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేయించాలనే లక్ష్యం ప్రభుత్వం పెట్టకుంది. ఈ మేరకు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించింది.

Follow Us