AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తుల ఆనందోత్సాహాల నడుమ హనుమాన్ విజయయాత్ర.. ర్యాలీలో ప్లకార్డ్ కలకలం..!

హైదరాబాద్‌ మహానగరంలో హనుమాన్‌ విజయ యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. పాతబస్తీ గౌలిగూడలో మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ ఆలయానికి చేరుకుంది. 12 కి.మీ ఈ ప్రధాన యాత్రలో సిటీలోని మరో 14 ఉపయాత్రలు కలిశాయి. అయితే హైదరాబాద్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటన వివాదంగా మారింది. హనుమాన్ జయంతి శోభాయాత్రలో గుజరాత్‌లో ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పోస్టర్‌ను ప్రదర్శించడంతో ఈ వివాదం తలెత్తింది.

భక్తుల ఆనందోత్సాహాల నడుమ హనుమాన్ విజయయాత్ర.. ర్యాలీలో ప్లకార్డ్ కలకలం..!
Lawrence Bishnoi Poster In Hunuman Vijayayatra
Balaraju Goud
|

Updated on: Apr 03, 2026 | 10:26 AM

Share

హైదరాబాద్‌ మహానగరంలో హనుమాన్‌ విజయ యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. పాతబస్తీ గౌలిగూడలో మొదలై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ ఆలయానికి చేరుకుంది. 12 కి.మీ ఈ ప్రధాన యాత్రలో సిటీలోని మరో 14 ఉపయాత్రలు కలిశాయి. అయితే హైదరాబాద్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటన వివాదంగా మారింది. హనుమాన్ జయంతి శోభాయాత్రలో గుజరాత్‌లో ఖైదీగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పోస్టర్‌ను ప్రదర్శించడంతో ఈ వివాదం తలెత్తింది. ఆ పోస్టర్‌కు మరోవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి ఊరేగింపులో లారెన్స్ బిష్ణోయ్ ఫోటో, రెచ్చగొట్టే నినాదాలు వివాదాన్ని సృష్టించాయి. ఈ ఊరేగింపు హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ కిందగా సాగింది. ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగుతుందని భావించిన ఈ ఊరేగింపు, వివాదాస్పద బ్యానర్‌ ప్రదర్శించడంతో చర్చనీయాంశంగా మారింది.

ఆ బ్యానర్‌కు ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రం ఉండగా, మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పోస్టర్ ఉంది. అంతేకాకుండా, ఆ బ్యానర్‌పై Aap ka baap aa raha rai (“మీ నాన్న వస్తున్నారు”) అనే హిందీ నినాదం రాసి ప్ల కార్డ్ ప్రదర్శించారు. ఇది ఒక పరోక్ష బెదిరింపులా కనిపించింది. లారెన్స్ బిష్ణోయ్ చాలా కాలంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఖైదీగా ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వ్యాపిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ఈ కంటెంట్ వేలాది సార్లు షేర్ చేశారు. కామెంట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ హనుమాన్ జయంతి 2026 ర్యాలీలో లారెన్స్ బిష్ణోయ్ పోస్టర్‌‌కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలావుంటే, లారెన్స్ బిష్ణోయ్‌పై దాదాపు 30 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఘటనకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలాంటి మార్గాన్ని అనుసరించవద్దని పోలీసులు కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిగికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిగికొట్టే చిట్కా?
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
ఈ నీటిని తక్కువగా అంచనా వేయకండి.. లెక్కలేనన్ని లాభాలు
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
గ్రహాల కరుణ.. వీరి జీవితంలో టర్నింగ్ పాయింట్ రాబోతోంది
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఈ అలవాటు అంత మంచిది కాదు.. వెంటనే మానుకోండి
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఫ్రిజ్‌ లేకుండానే నీళ్లను చల్లగా ఉంచాలా..? అమ్మమ్మల కాలం చిట్కాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు
ఐరన్ చేసే పనిలేదు.. బట్టలు ఉతికేప్పుడు జస్ట్ ఇలా చేస్తే చాలు