AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్న సీఎం

గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటని తెలిపారు. పదేళ్ల అనిశ్చితి తర్వాత యువతకు న్యాయం దక్కిందని సీఎం అభిప్రాయపడ్డారు.

Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్న సీఎం
Supreme Court Verdict Tgpsc
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 03, 2026 | 6:15 PM

Share

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకత, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన గ్రూప్-1 అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా మారిందన్నారు. అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల మధ్య పదేళ్ల పాటు ఎదురుచూసిన యువతకు ఈ నిర్ణయం న్యాయం చేసినట్టే అని అభిప్రాయపడ్డారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్షలు నిర్వహించి, తక్కువ సమయంలోనే నియామక పత్రాలు అందజేశామని సీఎం వివరించారు. నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలను ఎదుర్కొని, యువతను రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసిన టీజీపీఎస్సీపై సీఎం ప్రశంసలు కురిపించారు.

వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతలో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించిన ఛైర్మన్, అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ తీర్పుతో ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడటంతో పాటు, ఉద్యోగాల విషయంలో పారదర్శకతకు కొత్త ప్రమాణం ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
ఏసీ వల్ల బరువు పెరుగుతారా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. డీజిల్‌తో పనిచేసే స్టవ్..
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
అరేయ్ ఏంట్రా ఇది.. అర్థరాత్రి స్టంట్ చేసి వైరల్ అయ్యారు..చివరకు
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
టాస్ గెలిచిన పంజాబ్.. ధోని లేకుండానే బరిలోకి చెన్నై..
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
రోజూ ఒక కిలోమీటర్‌ నడవండి.. మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
అల్లాను కొలిచే చేతులతో అంజన్నకు మొక్కులు.. హనుమాన్ దీక్షలో..
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
పోసాని కృష్ణ మురళి మేనల్లుడు తెలుగులో టాప్ డైరెక్టర్ అని తెలుసా?
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
అప్పుడు వద్దన్నాడు.. తర్వాత హీరోగా సినిమా తీశాడు..
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త
వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త