AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Boat Accident: విహారయాత్రలో మాటలకందని విషాదం.. 16 మంది చిన్నారులు మృతి..

Gujarat Boat Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలో సరస్సులో పడవ తిరగబడింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు సహా ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాద సమయంలో బోటులో 27 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Vadodara Boat Accident: విహారయాత్రలో మాటలకందని విషాదం.. 16 మంది చిన్నారులు మృతి..
Gujarat Boat Accident
Shaik Madar Saheb
|

Updated on: Jan 18, 2024 | 10:16 PM

Share

Gujarat Boat Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలో సరస్సులో పడవ తిరగబడింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు సహా ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ప్రమాద సమయంలో బోటులో 27 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వడోదరలోని వడోదరలోని న్యూ సన్‌రైజ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను విహారయాత్రకు తీసుకువెళ్లింది. స్థానికంగా ఉన్న హరిణి సరస్సు వద్దకు తీసుకెళ్లారు. ఈ సమయంలో విద్యార్థులు సహా 27 మంది పడవలో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు సహా ఇద్దరు ఉపాధ్యాయులు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

వెంటనే స్పందించిన బోటింగ్ సంస్థ సిబ్బంది రంగంలోకి దిగి కొంత మందిని రక్షించారు. ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పడవలో ఉన్నవారిలో ఎవరూ లైఫ్‌ జాకెట్‌ ధరించలేదని, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

సరస్సులో మునిగిపోయిన పిల్లలు, ఉపాధ్యాయులను రక్షించడానికి NDRF సహా పోలీసులు, పాలనా యంత్రాంగం సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ టూర్ లో 23 మంది విద్యార్థులు, 4 ఉపాధ్యాయులతో సహా మొత్తం 27 మంది ఉన్నారని.. పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us