AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Expensive Mango: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు.. కేజీ ధరతో లగ్జరీ బైక్‌నే కొనొచ్చు!

World Most Expensive Mango: సమ్మర్ దొరికే మామిడి పండ్లను తినేందుకు జనాలు ఎక్కువగా ఇష్టడుతారు. ఎంత ఖర్చైనా కచ్చింతంగా వీటిని కొని తినాలి అనుకుంటారు. అయితే సాధారణంగా మనం మార్కెట్‌లో కిలో మామిడి పండ్లను 100 నుండి 300 వరకు కొంటుంటాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబయే మామిడి పండు ధర ఎంతో తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం పక్కా.. అవును జపాన్‌కు చెందిన 'మియాజాకి' రకం మామిడి పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. వీటిని 'ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా పిలుస్తారు.ఈ పండ్లు కేజీ ధర లక్షల్లో ఉంటుందట. ఇంతకు ఇవి ఎంకింత స్పెషల్ తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Apr 03, 2026 | 4:45 PM

Share
ఈ మామిడి పండు అంత ధర పలకడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఇవి చూడటానికి ముదురు ఎరుపు లేదా ఊదా రంగులో మెరుస్తూ ఉంటాయి. సూర్యరశ్మి నేరుగా పండుపై పడటం వల్ల వీటికి ఈ రంగు వస్తుంది.

1 / 5
అలాగే వీటిని పండించడం చాలా కష్టమైన పని. జపాన్‌లోని మియాజాకి నగరంలో వీటిని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతి పండుకు ఒక నెట్ కట్టి, అది కింద పడకుండా, దెబ్బతినకుండా చూస్తారు.

2 / 5
ఈ చెట్టుకు కాసే ప్రతి పండు కనీసం 350 గ్రాముల బరువు ఉండాలి. అలాగే అందులో చక్కెర శాతం 15శాతం కంటే ఎక్కువగా ఉంటేనే దానిని 'మియాజాకి' బ్రాండ్‌తో అమ్ముతారు.ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా, జ్యూసీగా ఉంటుంది. అంతే కాదు ఈ పండ్లను కోసినప్పుడు దీని వాసన గది అంతా వ్యాపిస్తుంది.

3 / 5
ధర ఎంత ఉంటుంది?: ఇక ఈ పండు ధర విషయానిక వస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కిలో మియాజాకి మామిడి పండ్ల ధర సుమారు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఈ ధరకు మన ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు లేదా ఒక లగ్జరీ బైక్‌ను కొనేయవచ్చు.

4 / 5
జపాన్‌కే పరిమితమైన ఈ పండు ఇప్పుడు భారతదేశంలో కూడా వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఒక రైతు తన తోటలో ఈ చెట్లను పెంచారు. ఆ పండ్లు దొంగతనం కాకుండా ఉండటానికి ఆయన ఏకంగా సెక్యూరిటీ గార్డులను, వేట కుక్కలను కాపలాగా పెట్టడం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమైంది.

5 / 5
Follow Us