ఆ సేతుపై ఫొటోలు తీస్తే కేసు పెడతాం.. పోలీసుల వార్నింగ్

ఆ సేతుపై ఫొటోలు తీస్తే కేసు పెడతాం.. పోలీసుల వార్నింగ్

Phani CH

|

Updated on: Jan 18, 2024 | 7:34 PM

ఇంజ‌నీరింగ్ అద్భుతంగా చెబుతున్నఅట‌ల్ సేతు ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల ప్రారంభించారు. భార‌త్‌లో అతిపెద్ద స‌ముద్ర వంతెన అట‌ల్ సేతును జాతికి అంకితం చేసిన వెంట‌నే ప్ర‌జ‌లు ఈ బ్రిడ్జిపై త‌మ వాహ‌నాల‌ను నిలిపివేసి సెల్ఫీలు తీసుకుంటూ సీ వ్యూను ఆస్వాదిస్తున్నారు. కొంద‌రు బ్రిడ్జి ప‌రిస‌ర ప్రాంతాల‌ను చూసేందుకు వెళుతుండ‌టంతో ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయి. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇంజ‌నీరింగ్ అద్భుతంగా చెబుతున్నఅట‌ల్ సేతు ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల ప్రారంభించారు. భార‌త్‌లో అతిపెద్ద స‌ముద్ర వంతెన అట‌ల్ సేతును జాతికి అంకితం చేసిన వెంట‌నే ప్ర‌జ‌లు ఈ బ్రిడ్జిపై త‌మ వాహ‌నాల‌ను నిలిపివేసి సెల్ఫీలు తీసుకుంటూ సీ వ్యూను ఆస్వాదిస్తున్నారు. కొంద‌రు బ్రిడ్జి ప‌రిస‌ర ప్రాంతాల‌ను చూసేందుకు వెళుతుండ‌టంతో ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయి. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అట‌ల్ సేతుపై ఆగి ఫొటోలు క్లిక్‌మ‌నిపించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని ముంబై పోలీసులు హెచ్చ‌రించారు. ముంబై ట్రాన్స్ హార్బ‌ర్ లింక్‌పై ఆగి, ఫొటోలు తీసుకునేవారిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అట‌ల్ సేతు చూడ‌ద‌గిన ప్ర‌దేశ‌మే, ఈ విషయాన్ని తాము కూడా అంగీక‌రిస్తామ‌ని, అయితే ఈ ప్ర‌తిష్టాత్మ‌క వంతెన‌పై ఆగి ఫొటోలు తీయడం స‌రైంది కాద‌ని, ఈ వంతెన‌పై నిలిచి హంగామా చేస్తే ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని ముంబై పోలీసులు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామ భజన పాడిన 19 ఏళ్ల కశ్మీరీ ముస్లిం యువతి

ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా

Simhachalam: సింహాచల అప్పన్న ఆలయ వేడుకలో అరుదైన ఘటన..

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ

అవును.. ఆ హీరోయిన్‌తో సంబంధం ఉంది.. బాంబు పేల్చిన స్టార్ డైరెక్టర్