రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన సీనియర్ హీరో
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు. ఈ మహత్తర ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అలాగే పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా పాల్గోనున్నారు. అయితే ఇంతలో ఒక సీనియర్ హీరోకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్ తన సింప్లిసిటీని చాటుకున్నారు. సెలబ్రిటీ అన్న స్టేటస్‌ను పక్కన పెట్టి రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ సేతుపై ఫొటోలు తీస్తే కేసు పెడతాం.. పోలీసుల వార్నింగ్
రామ భజన పాడిన 19 ఏళ్ల కశ్మీరీ ముస్లిం యువతి
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థిగా ప్రీషా