కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలైన లేబర్ కోడ్లతో జీతాల నిర్మాణం మారింది. బేసిక్ శాలరీలో 50% తప్పనిసరి చేయడంతో నెట్ జీతం తగ్గుతుంది. అయితే పీఎఫ్, ఎన్పీఎస్ ద్వారా రిటైర్మెంట్ కార్పస్ పెరుగుతుంది. ఉద్యోగులకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ రెండు పనిదినాల్లో పూర్తవుతుంది. ట్యాక్స్ ఇయర్ విధానం కూడా సరళీకరించబడింది.