PM Narendra Modi: ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థి.. సంతాపం ప్రకటించిన పీఎం మోదీ..
PM Narendra Modi: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రధాని..
PM Narendra Modi: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. ఖార్కివ్ కాల్పుల్లో భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన వార్త తెలియగానే.. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రధాని మోదీ మాట్లాడారు. నవీన్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇదిలాఉంటే.. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన నవీన్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సంతాపం ప్రకటించారు. నవీన్ తండ్రి శేఖర్ గౌడ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. నవీన్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నవీన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నవీన్ పార్థీవ దేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు సీఎం. దీనికి సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కాగా, తన కుమారుడు నవీన్‌తో ఇవాళ ఉదయం కూడా ఫోన్‌లో మాట్లాడానని, ప్రతి రోజూ రెండుసార్లు ఫోన్‌కాల్ చేసేవాడంటూ కుమారుడి గురించి చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు నవీన్ తండ్రి శేఖర్ గౌడ్.
ఇకపోతే ‘‘ఈ ఉదయం ఖార్కివ్‌లో జరిగిన బాంబు దాడుల్లో భారతీయ విద్యార్థి నవీన్ ప్రాణాలు కోల్పోయారని తీవ్ర విచారంతో ధృవీకరిస్తున్నాము. సంబంధిత అధికారులు మృతుని కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతోంది. కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.’’ అని విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also read:
చలాన్ల ఆఫర్ కు భారీ స్పందన.. రుసుముల చెల్లింపునకు పోటీ.. ఒత్తిడికి సర్వర్లు హ్యాంగ్
Sea Creatures: ఈ జీవులు చాలా డేంజర్ గురూ.. మనిషిని కాటేస్తే నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు..!